కుటిలా లేఁటికి కోమలియెడ నేఁ
(॥పల్లవి॥)
కుటిలా లేఁటికి కోమలియెడ నేఁ
డిటువలెఁ జేయఁగ నింపౌనా
(॥కుటిలా॥)
పుప్పొడిచల్లినఁ బొక్కెటిదేహము
కప్పుర మేఁటికిఁ గలుపేరె
ఒప్పుగ వేనీ ళ్లొల్లనిదేహము
నిప్పులు చల్లఁగ నిలచీనా
(॥కుటిలా॥)
వెన్నెలబాయట వేగెటిమేనికి
పన్నీ రేఁటికిఁ బామేరె
సున్నపురాతికి జొబ్బిల నుదకము
నున్నతిఁ జల్లఁగ నోర్చీనా
(॥కుటిలా॥)
తిరువేంకటపతి తెప్పలఁ దేలఁగ
తరుణికి నేఁటికిఁ దాపములూ
దొరకొని దైవముతో మాటలాడఁగ
పరికెలు వెట్టఁగఁ బాడౌనా
(||pallavi||)
kuḍilā lem̐ṭigi komaliyĕḍa nem̐
ḍiḍuvalĕm̐ jeyam̐ga niṁpaunā
(||kuḍilā||)
puppŏḍisallinam̐ bŏkkĕḍidehamu
kappura mem̐ṭigim̐ galuberĕ
ŏppuga venī ḽlŏllanidehamu
nippulu sallam̐ga nilasīnā
(||kuḍilā||)
vĕnnĕlabāyaḍa vegĕḍimenigi
pannī rem̐ṭigim̐ bāmerĕ
sunnaburādigi jŏbbila nudagamu
nunnadim̐ jallam̐ga norsīnā
(||kuḍilā||)
tiruveṁkaḍabadi tĕppalam̐ delam̐ga
taruṇigi nem̐ṭigim̐ dābamulū
dŏragŏni daivamudo māḍalāḍam̐ga
parigĕlu vĕṭṭam̐gam̐ bāḍaunā