Kuchchidamu leṟamgani komalulamu

కుచ్చితము లెఱఁగని కోమలులము
Language

(॥పల్లవి॥)
కుచ్చితము లెఱఁగని కోమలులము
బచ్చన చేఁతల నేరుపరి విదె నీవు

(॥కుచ్చి॥)
అప్పటి నీసుద్దలెల్లా నాడుకొనఁగా నింతలో
యిప్పడు విచ్చేసితివి యీడకే నీవు
ముప్పిరి నిన్నుఁ జూచి మొక దాకిరిని నీతో
విప్పేటి సెలవుల నవ్వే మిదే నేము

(॥కుచ్చి॥)
పంతపునీపై పాదాలు పాడఁగానే యేకతాన
వింత లిదె నీకు నీవె వింటివి నేఁడు
కొంత ముండె మేళముగఁ గొసరఁగఁ జాలక
బంతినే నీరూపము తప్పక చూచితి మిదివో

(॥కుచ్చి॥)
ప్రియమున నాలో నిన్ను పేరుకొని పిలువఁగ
దయతోఁ బలికితివి దగ్గరి నీవు
నియతి శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడి పాయ కిట్టె
నయమై నీసరసాన నంటుసేసే మిదివో

(||pallavi||)
kuchchidamu lĕṟam̐gani komalulamu
bachchana sem̐tala nerubari vidĕ nīvu

(||kuchchi||)
appaḍi nīsuddalĕllā nāḍugŏnam̐gā niṁtalo
yippaḍu vichchesidivi yīḍage nīvu
muppiri ninnum̐ jūsi mŏga dāgirini nīdo
vippeḍi sĕlavula navve mide nemu

(||kuchchi||)
paṁtabunībai pādālu pāḍam̐gāne yegadāna
viṁta lidĕ nīgu nīvĕ viṁṭivi nem̐ḍu
kŏṁta muṁḍĕ meḽamugam̐ gŏsaram̐gam̐ jālaga
baṁtine nīrūbamu tappaga sūsidi midivo

(||kuchchi||)
priyamuna nālo ninnu perugŏni piluvam̐ga
dayadom̐ baligidivi daggari nīvu
niyadi śhrī veṁkaḍeśha ninnum̐ gūḍi pāya kiṭṭĕ
nayamai nīsarasāna naṁṭusese midivo