Kuchchidame nee vaidem goodabettugomdu gaani

కుచ్చితమే నీ వైతేఁ గూడపెట్టుకొందు గాని
Language

(॥పల్లవి॥)
కుచ్చితమే నీ వైతేఁ గూడపెట్టుకొందు గాని
యిచ్చకురాల నే నైతే నింత వని కోపరా

(॥కుచ్చిత॥)
చలమంతాఁ దీరీ నంటా సరసమాడవు గాని
మలసి నేఁ బై కొనక మానలేను రా
వెలిఁబడి నవ్వంటా వెసన నోఁతువు గాని
వొలసి నే నైతే నవ్వ కుండలేను రా

(॥కుచ్చిత॥)
మాట గోరువోయీ నంటా మౌనాన నుందును గాని
నీటున ముచ్చటాడక నే మానరా
సూటి వెచ్చ మయ్యీ నంటాఁ జూడను లోఁగేవు గాని
గాటమున నిన్నుఁ జూచి కన్ను మూయఁ జాల రా

(॥కుచ్చిత॥)
కాయ మరగీ నంటాఁ గౌఁగిలించ కుందు గాని
ఆయ మంటి కౌఁగిలించ కాఁపలేను రా
చేయార శ్రీవేంకటేశ సిగ్గునఁ గూడితి గాని
వేయైనా నీ వురాన వెల్లివిరి యైతిరా

(||pallavi||)
kuchchidame nī vaidem̐ gūḍabĕṭṭugŏṁdu gāni
yichchagurāla ne naide niṁta vani kobarā

(||kuchchida||)
salamaṁtām̐ dīrī naṁṭā sarasamāḍavu gāni
malasi nem̐ bai kŏnaga mānalenu rā
vĕlim̐baḍi navvaṁṭā vĕsana nom̐tuvu gāni
vŏlasi ne naide navva kuṁḍalenu rā

(||kuchchida||)
māḍa goruvoyī naṁṭā maunāna nuṁdunu gāni
nīḍuna muchchaḍāḍaga ne mānarā
sūḍi vĕchcha mayyī naṁṭām̐ jūḍanu lom̐gevu gāni
gāḍamuna ninnum̐ jūsi kannu mūyam̐ jāla rā

(||kuchchida||)
kāya maragī naṁṭām̐ gaum̐giliṁcha kuṁdu gāni
āya maṁṭi kaum̐giliṁcha kām̐palenu rā
seyāra śhrīveṁkaḍeśha siggunam̐ gūḍidi gāni
veyainā nī vurāna vĕlliviri yaidirā