కుచ్చితాలే నీ వైతే కూడపెట్టుకొందు గాని
(॥పల్లవి॥)
కుచ్చితాలే నీ వైతే కూడపెట్టుకొందు గాని
యిచ్చకురాల నే నైతే యింతపని కోపరా
(॥కుచ్చి॥)
మాట గోరువోయీ నంట మౌనాన నుందువు గాని
నీటున ముచ్చటాడక నే మానరా
సూటి దప్పిపోయీ నంటా చూడను లోఁగేవు గాని
గాటమున నిన్నుఁ జూచి కన్ను మూయఁ జాలరా
(॥కుచ్చి॥)
చల మంతా దేరీ నంటా సరలమాడవు గాని
మలసి నేఁ బైకొనక మాన లేనురా
వెలిఁబడే నవ్వంటా వెస నణఁతువు గాని
వొలసి నే నైతే నవ్వకుండ లేనురా
(॥కుచ్చి॥)
కాయ మరగీ నంటా కౌఁగిలించ కుందు గాని
ఆయ మంటి కౌఁగిలించ కాఁ ప లేనురా
చేయార శ్రీవేంకటేశ సిగ్గునఁ గూడితి గాని
వేయైనా నా నీవురముపై వెల్లివిరి యైతిరా
(||pallavi||)
kuchchidāle nī vaide kūḍabĕṭṭugŏṁdu gāni
yichchagurāla ne naide yiṁtabani kobarā
(||kuchchi||)
māḍa goruvoyī naṁṭa maunāna nuṁduvu gāni
nīḍuna muchchaḍāḍaga ne mānarā
sūḍi dappiboyī naṁṭā sūḍanu lom̐gevu gāni
gāḍamuna ninnum̐ jūsi kannu mūyam̐ jālarā
(||kuchchi||)
sala maṁtā derī naṁṭā saralamāḍavu gāni
malasi nem̐ baigŏnaga māna lenurā
vĕlim̐baḍe navvaṁṭā vĕsa naṇam̐tuvu gāni
vŏlasi ne naide navvaguṁḍa lenurā
(||kuchchi||)
kāya maragī naṁṭā kaum̐giliṁcha kuṁdu gāni
āya maṁṭi kaum̐giliṁcha kām̐ pa lenurā
seyāra śhrīveṁkaḍeśha siggunam̐ gūḍidi gāni
veyainā nā nīvuramubai vĕlliviri yaidirā