Kshidi nittinerubu seedaadevigim galige

క్షితి నిట్టినేరుపు సీతాదేవికిఁ గలిగె
Language

(॥పల్లవి॥)
క్షితి నిట్టినేరుపు సీతాదేవికిఁ గలిగె
తతితోడ దశరథ తనయుని యెడను

(॥క్షితి॥)
పతి చిత్త మెరిఁగి తప్పక వూడిగము చేసి
అతనినే తన దైవమని తలఁచి
సతమై యనేక వుపచారములఁబోషించి
వ్రతము గైకొని యుండవలయు సతికిని

(॥క్షితి॥)
పరపురుషుఁ జూడక ప్రాణేశ్వరునే కోరి
సరవితో నతని ప్రసాద జీవియై
దొరసి యెడవాయక తోడు నీడయై యుండి
వరుస మీరక యుండవలయు సతికిని

(॥క్షితి॥)
యెదురాడక శ్రీ వేంకటేశ్వరు కిందిరవలె
కదిసి యతని కిచ్చకముగ గూడి
అదనెరిఁగి యేపొద్దు నంకెకు లోనైవుండి
వదలక బత్తిసేయవలయు సతికిని

(||pallavi||)
kṣhidi niṭṭinerubu sīdādevigim̐ galigĕ
tadidoḍa daśharatha tanayuni yĕḍanu

(||kṣhidi||)
padi sitta mĕrim̐gi tappaga vūḍigamu sesi
adanine tana daivamani talam̐si
sadamai yanega vubasāramulam̐boṣhiṁchi
vradamu gaigŏni yuṁḍavalayu sadigini

(||kṣhidi||)
paraburuṣhum̐ jūḍaga prāṇeśhvarune kori
saravido nadani prasāda jīviyai
dŏrasi yĕḍavāyaga toḍu nīḍayai yuṁḍi
varusa mīraga yuṁḍavalayu sadigini

(||kṣhidi||)
yĕdurāḍaga śhrī veṁkaḍeśhvaru kiṁdiravalĕ
kadisi yadani kichchagamuga gūḍi
adanĕrim̐gi yebŏddu naṁkĕgu lonaivuṁḍi
vadalaga battiseyavalayu sadigini