క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
(॥పల్లవి॥)
క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు(యకును?) నీరాజనం
(॥క్షీరా॥)
జలజాక్షి మోమునకు జక్కవకుచంబులకు
నెలకొన్న కప్పురపునీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం
(॥క్షీరా॥)
చరణకిసలయములకు సకియరంభోరులకు
నిరతమగుముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివనిజఁ నాభికిని
నిరతి నానావర్ణనీరాజనం
(॥క్షీరా॥)
పగటు శ్రీ వేంకటేశు పట్టిపురాణియై
నెగడుసతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనముల కెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం
(||pallavi||)
kṣhīrābdhiganyagagu śhrī mahālakṣhmigini
nīrajālayamunagu(yagunu?) nīrājanaṁ
(||kṣhīrā||)
jalajākṣhi momunagu jakkavagusaṁbulagu
nĕlagŏnna kappurabunīrājanaṁ
aliveṇi turumunagu hastagamalaṁbulagu
niluvu māṇikyamula nīrājanaṁ
(||kṣhīrā||)
saraṇagisalayamulagu sagiyaraṁbhorulagu
niradamagumuttela nīrājanaṁ
aridi jaghanaṁbunagu nadivanijam̐ nābhigini
niradi nānāvarṇanīrājanaṁ
(||kṣhīrā||)
pagaḍu śhrī veṁkaḍeśhu paṭṭiburāṇiyai
nĕgaḍusadigaḽalagunu nīrājanaṁ
jagadi nalamelmaṁga sakkam̐danamula kĕlla
niguḍu nijaśhobhanabu nīrājanaṁ