కోవిల పలుకదు కొమ్మావి లతల
(॥పల్లవి॥)
కోవిల పలుకదు కొమ్మావి లతల
దైవిక మిదివో తలకిందాయ
(॥కోవి॥)
ఇటునటు యినుఁడిదె యెండలు గాసీ
నటుగతి గిరుల నభములందు
అటువలెఁ గప్పిన యంధకారమిదె
నిటలపుటలుకల నిక్కములాయ
(॥కోవి॥)
వెగటునఁ దోఁటల వెన్నెలగాసీ
ఒగిఁ గలువకొలకు లుబ్బఁగను
అగపడి అటువలెనైనాఁ జెలి నీఁ
మొగమునఁ గోపము ముచ్చటలాయ
(॥కోవి॥)
సొరిది నలుగడలఁ జుక్కలు గాసీ
నరుదుగ నే నిట్లయినాను
తిరువేంకటగిరి దేవుని కౌఁగిట
కరుణ మన్మథ గ్రహణంబాయ
(||pallavi||)
kovila palugadu kŏmmāvi ladala
daiviga midivo talagiṁdāya
(||kovi||)
iḍunaḍu yinum̐ḍidĕ yĕṁḍalu gāsī
naḍugadi girula nabhamulaṁdu
aḍuvalĕm̐ gappina yaṁdhagāramidĕ
niḍalabuḍalugala nikkamulāya
(||kovi||)
vĕgaḍunam̐ dom̐ṭala vĕnnĕlagāsī
ŏgim̐ galuvagŏlagu lubbam̐ganu
agabaḍi aḍuvalĕnainām̐ jĕli nīm̐
mŏgamunam̐ gobamu muchchaḍalāya
(||kovi||)
sŏridi nalugaḍalam̐ jukkalu gāsī
naruduga ne niṭlayinānu
tiruveṁkaḍagiri devuni kaum̐giḍa
karuṇa manmatha grahaṇaṁbāya