Kottasimgaaraalu sesem gomma dana menilone

కొత్తసింగారాలు సేసెఁ గొమ్మ దన మేనిలోనె
Language

(॥పల్లవి॥)
కొత్తసింగారాలు సేసెఁ గొమ్మ దన మేనిలోనె
చిత్తగించి రారాదా చెలిఁ జూతుగానీ

(॥॥)
కుప్పలుసేసె వలపు కుచములనె యిట్టె
చిప్పిలఁ గరఁగె మతి చెమటలను
కప్పుకొనెఁ జీకట్లు కడుజారిననెరుల
యిప్పుడే విచ్చేయరాదా యింతిఁ జూతుగానీ

(॥॥)
నిండఁ జేసెఁ దమకము నిట్టూర్పుగములను
పండఁజేసె పులకలపైరులు మేన
యెండించెఁ గాఁకలచేత యింపుమోవి, తీపువుట్ట
అండకు విచ్చేయరాదా ఆకెఁ జాతుగానీ

(॥॥)
వెదచెల్లెఁ జూపులనె వేవేలు ఆసలెల్లా
నిదురవోయీ నీపై నివ్వెరగుల
అదె శ్రీవేంకటేశ నీ వలమేలుమంగఁ గూడి-
తిదె దినము రారాదా యిఁకనైనాఁ గానీ

(||pallavi||)
kŏttasiṁgārālu sesĕm̐ gŏmma dana menilonĕ
sittagiṁchi rārādā sĕlim̐ jūdugānī

(||||)
kuppalusesĕ valabu kusamulanĕ yiṭṭĕ
sippilam̐ garam̐gĕ madi sĕmaḍalanu
kappugŏnĕm̐ jīgaṭlu kaḍujārinanĕrula
yippuḍe vichcheyarādā yiṁtim̐ jūdugānī

(||||)
niṁḍam̐ jesĕm̐ damagamu niṭṭūrbugamulanu
paṁḍam̐jesĕ pulagalabairulu mena
yĕṁḍiṁchĕm̐ gām̐kalaseda yiṁpumovi, tībuvuṭṭa
aṁḍagu vichcheyarādā āgĕm̐ jādugānī

(||||)
vĕdasĕllĕm̐ jūbulanĕ vevelu āsalĕllā
niduravoyī nībai nivvĕragula
adĕ śhrīveṁkaḍeśha nī valamelumaṁgam̐ gūḍi-
tidĕ dinamu rārādā yim̐kanainām̐ gānī