Kottalu gade veeni komduga baalamuddulu

కొత్తలు గదే వీని కొండుక బాలముద్దులు
Language

(॥పల్లవి॥)
కొత్తలు గదే వీని కొండుక బాలముద్దులు
చిత్తరుబొమ్మలవద్ద జేరి యాడెఁ గృష్ణుఁడు

(॥కొత్తలు॥)
నీరాటిలోనఁ దన నీడచూచి బాలుఁ డంటా
రా రమ్మని పిలిచి రాకుండఁగా
కారించి కడవనీరు కలఁచి చేత వెదకి
వూరకె కానక పొంచివున్నాఁడు కృష్ణుఁడు

(॥కొత్తలు॥)
నీలపుఁ గంటసరులు నేరేడుబం డ్లంటా
గోలయై నమలఁబోయి కొరుక రాక
వోలి మెత్తగాను వొలిచి యిమ్మని తల్లి
చేలకొంగువట్టి తీసి చెప్పరాని కృష్ణుఁడు

(॥కొత్తలు॥)
ఆకసముచందురుని నదె వెన్నముద్ద యంటా
ఆకడ చేయి చాఁచి యందఁగ రాక
శ్రీకాంతతోడఁ గడి శ్రీవేంకటాద్రి యెక్కె
పైకొని పెచ్చుపెరిగి ప్రౌఢాయఁ గృష్ణుఁడు

(||pallavi||)
kŏttalu gade vīni kŏṁḍuga bālamuddulu
sittarubŏmmalavadda jeri yāḍĕm̐ gṛṣhṇum̐ḍu

(||kŏttalu||)
nīrāḍilonam̐ dana nīḍasūsi bālum̐ ḍaṁṭā
rā rammani pilisi rāguṁḍam̐gā
kāriṁchi kaḍavanīru kalam̐si seda vĕdagi
vūragĕ kānaga pŏṁchivunnām̐ḍu kṛṣhṇum̐ḍu

(||kŏttalu||)
nīlabum̐ gaṁṭasarulu nereḍubaṁ ḍlaṁṭā
golayai namalam̐boyi kŏruga rāga
voli mĕttagānu vŏlisi yimmani talli
selagŏṁguvaṭṭi tīsi sĕpparāni kṛṣhṇum̐ḍu

(||kŏttalu||)
āgasamusaṁduruni nadĕ vĕnnamudda yaṁṭā
āgaḍa seyi sām̐si yaṁdam̐ga rāga
śhrīgāṁtadoḍam̐ gaḍi śhrīveṁkaḍādri yĕkkĕ
paigŏni pĕchchubĕrigi prauḍhāyam̐ gṛṣhṇum̐ḍu