కొత్తలేల సేసేవు కొసరనేల వచ్చేవు
(॥పల్లవి॥)
కొత్తలేల సేసేవు కొసరనేల వచ్చేవు
చిత్తములో వుండినట్టి చెలినే కానా
(॥కొత్త॥)
యిక్కువలేలంటేవు యింత యేల సేసేవు
మొక్కితి నీకు నేను మొన్ననే కాదా
పెక్కుమాట లేలాడేవు పెనఁగ నేల వచ్చేవు
అక్కర దీరుచు తొల్లే ఆల నీకుఁ గానా
(॥కొత్త॥)
సన్నలేల సేసేవు సరసమేలాడేవు
నిన్ను నేవేఁడుకొంటిని నిన్ననే కాదా
చన్నులేల పిసికేవు జవ్వన మేలొరసేవు
కన్నెనాఁటనుండి నీకాంతనే కానా
(॥కొత్త॥)
పాదమేల తొక్కేవు పంతము లేలాడేవు
నీదయకు లోనైతి నేఁడే కాదా
యీదెస శ్రీవేంకటేశ యేలితి విన్నిటా నన్ను
భేదములేని యప్పటి ప్రియరాలఁ గానా
(||pallavi||)
kŏttalela sesevu kŏsaranela vachchevu
sittamulo vuṁḍinaṭṭi sĕline kānā
(||kŏtta||)
yikkuvalelaṁṭevu yiṁta yela sesevu
mŏkkidi nīgu nenu mŏnnane kādā
pĕkkumāḍa lelāḍevu pĕnam̐ga nela vachchevu
akkara dīrusu tŏlle āla nīgum̐ gānā
(||kŏtta||)
sannalela sesevu sarasamelāḍevu
ninnu nevem̐ḍugŏṁṭini ninnane kādā
sannulela pisigevu javvana melŏrasevu
kannĕnām̐ṭanuṁḍi nīgāṁtane kānā
(||kŏtta||)
pādamela tŏkkevu paṁtamu lelāḍevu
nīdayagu lonaidi nem̐ḍe kādā
yīdĕsa śhrīveṁkaḍeśha yelidi vinniḍā nannu
bhedamuleni yappaḍi priyarālam̐ gānā