Kottagotta valabula kodesemtalavaamdu

కొత్తకొత్త వలపుల కోడెచేఁతలవాఁడు
Language

(॥పల్లవి॥)
కొత్తకొత్త వలపుల కోడెచేఁతలవాఁడు
హత్తి ఇచ్చకములనే అట్టె లోఁగొనెనె

(॥॥)
ననిచితే నామగని నవ్చించెను
పెఁగులాడఁగలితే బెల్లించెను
మనసిచ్చి మాటాడితే మతి గరఁగించెను
చెనకఁగ వచ్చితేను చిక్కించుకొనెనె

(॥॥)
అగపడితేఁజాలు నాసలెల్లా రేఁచెను
నగ నివె పాయరానినంటు సేసెను
మొగము చూచితేను మోహములు వుట్టించెను
తగులుగా నియ్యవె తలఁపించుకొనెను

(॥॥)
సముకముగా నివె చవులెల్లా నించెను
జమలిఁ గూచుండితేనే సాదించెను
అమర శ్రీ వేంకటేశుఁడల మేలుమంగను నేను
సమరతిఁ గూడె నింకా సరసములాడీనే

(||pallavi||)
kŏttagŏtta valabula koḍĕsem̐talavām̐ḍu
hatti ichchagamulane aṭṭĕ lom̐gŏnĕnĕ

(||||)
naniside nāmagani navchiṁchĕnu
pĕm̐gulāḍam̐galide bĕlliṁchĕnu
manasichchi māḍāḍide madi garam̐giṁchĕnu
sĕnagam̐ga vachchidenu sikkiṁchugŏnĕnĕ

(||||)
agabaḍidem̐jālu nāsalĕllā rem̐sĕnu
naga nivĕ pāyarāninaṁṭu sesĕnu
mŏgamu sūsidenu mohamulu vuṭṭiṁchĕnu
tagulugā niyyavĕ talam̐piṁchugŏnĕnu

(||||)
samugamugā nivĕ savulĕllā niṁchĕnu
jamalim̐ gūsuṁḍidene sādiṁchĕnu
amara śhrī veṁkaḍeśhum̐ḍala melumaṁganu nenu
samaradim̐ gūḍĕ niṁkā sarasamulāḍīne