Kottagaa vachchinaabe neeguna memi neṟamgadu

కొత్తగా వచ్చినాపె నీగుణ మేమి నెఱఁగదు
Language

(॥పల్లవి॥)
కొత్తగా వచ్చినాపె నీగుణ మేమి నెఱఁగదు
బత్తిసేసి లాలించితే పనికివచ్చీని

(॥కొత్త ॥)
చిగురుమోవి దెరచి చెలి యేమో విన్నవించీ
వెగటులేక నీవు వినవయ్య
జిగిమించి యంతలోనే సిగ్గువడియున్నదేమో
అగడుగాకుండాఁ గూర్మి నడుగవయ్యా

(॥కొత్త॥)
నెలఁత వినయముతో నీవద్ది కేఁటికో వచ్చీ
చెలరేఁగి యాపనులు సేయవయ్యా
యెలమి నీయెదుటను ఇచ్చక మేలో నెరపీ
సెలవుగా ఆచనవు చెల్లించవయ్యా

(॥కొత్త॥)
వొయ్యన కదిసి యేవె వూడిగాలు సేసేని
ఇయ్యెడ నీ వాపచేఁ జేయించుకొవయ్య
అయ్య శ్రీవేంకటేశ్వర అలమేల్‌మంగపతివి
నెయ్యాన నన్నేలితివి నీవాకెఁ గూడవయ్యా

(||pallavi||)
kŏttagā vachchinābĕ nīguṇa memi nĕṟam̐gadu
battisesi lāliṁchide panigivachchīni

(||kŏtta ||)
sigurumovi dĕrasi sĕli yemo vinnaviṁchī
vĕgaḍulega nīvu vinavayya
jigimiṁchi yaṁtalone sigguvaḍiyunnademo
agaḍugāguṁḍām̐ gūrmi naḍugavayyā

(||kŏtta||)
nĕlam̐ta vinayamudo nīvaddi kem̐ṭigo vachchī
sĕlarem̐gi yābanulu seyavayyā
yĕlami nīyĕduḍanu ichchaga melo nĕrabī
sĕlavugā āsanavu sĕlliṁchavayyā

(||kŏtta||)
vŏyyana kadisi yevĕ vūḍigālu seseni
iyyĕḍa nī vābasem̐ jeyiṁchugŏvayya
ayya śhrīveṁkaḍeśhvara alamel‌maṁgabadivi
nĕyyāna nannelidivi nīvāgĕm̐ gūḍavayyā