Kottagaa naado pomdugoodi ninnu bhramayimchi

కొత్తగా నాతో పొందుగూడి నిన్ను భ్రమయించి
Language

(॥పల్లవి॥)
కొత్తగా నాతో పొందుగూడి నిన్ను భ్రమయించి
ఇత్తల నిన్నొకటై యెలయించీఁ గాక

(॥॥)
కన్నులనాచూపు నిన్నుఁ గాఁడిపారెనటవే
వున్నతి నీమోహ మటువున్నది గాక
సన్నలు నేఁ జేసితేనే జల్లనీనా నీగుండె
కన్నెరో నీమతి నిన్నే కరఁగించీఁగాక

(॥॥)
వేడుక నానవ్వు నిన్ను వెన్నెలై వేఁచీనటవే
కూడుదాఁకా విరహము గొసరీఁ గాక
ఆడిననామాట జిగురై నిన్ను నంటించీనా
యేడలేనినీకోరిక లింతసేసీఁ గాక

(॥॥)
యిట్టె నాతో పొందు బయలీఁదించెనటవే
చుట్టుకొన్ననీకాఁగిలే చొక్కించెఁగాక
దిట్ట శ్రీ వేంకటేశుఁడు రట్టు సేసెనా నిన్ను
చుట్టరికపు నీమేలే జట్టిగొనెఁ గాక

(||pallavi||)
kŏttagā nādo pŏṁdugūḍi ninnu bhramayiṁchi
ittala ninnŏgaḍai yĕlayiṁchīm̐ gāga

(||||)
kannulanāsūbu ninnum̐ gām̐ḍibārĕnaḍave
vunnadi nīmoha maḍuvunnadi gāga
sannalu nem̐ jesidene jallanīnā nīguṁḍĕ
kannĕro nīmadi ninne karam̐giṁchīm̐gāga

(||||)
veḍuga nānavvu ninnu vĕnnĕlai vem̐sīnaḍave
kūḍudām̐kā virahamu gŏsarīm̐ gāga
āḍinanāmāḍa jigurai ninnu naṁṭiṁchīnā
yeḍaleninīgoriga liṁtasesīm̐ gāga

(||||)
yiṭṭĕ nādo pŏṁdu bayalīm̐diṁchĕnaḍave
suṭṭugŏnnanīgām̐gile sŏkkiṁchĕm̐gāga
diṭṭa śhrī veṁkaḍeśhum̐ḍu raṭṭu sesĕnā ninnu
suṭṭarigabu nīmele jaṭṭigŏnĕm̐ gāga