కొత్తపొందో పాఁతపొందో కొమ్మతో మాటాడవయ్య
(॥పల్లవి॥)
కొత్తపొందో పాఁతపొందో కొమ్మతో మాటాడవయ్య
బత్తిగలవారిమీఁదఁ బరాకు చూపుదురా
(॥కొత్త॥)
చెక్కుల వెంటఁగారేచిరుఁజెమటలతోడ
నిక్కినిక్కి చూచీని నెలఁత నిన్ను
వెక్కసపుఁదనకొప్పు వీఁపువెంట జారఁగాను
తక్కక నిమ్మపంటఁ దాఁకవేసీ నిన్ను
(॥కొత్త॥)
గుఱుతులై పయ్యదలో గుబ్బలు గానరాఁగాను
ముఱిపానఁ జేతులెత్తి మొక్కీ నీకు
తఱితోడ ముక్కర గదలఁగాఁ బెదవులెత్తి
మెఱిసి పేరఁబిలిచీ మిక్కిలి నిన్ను
(॥కొత్త॥)
అదనెఱిఁగి ముంగిట నందెలు గల్లురనఁగ
యెదురుగా వచ్చి కానుకిచ్చీ నాపె
యిదె శ్రీవేంకటేశ్వర యే నలమేలుమంగను
కదిసి నన్నేలితివి కాగిలించీఁ దా నిన్ను
(||pallavi||)
kŏttabŏṁdo pām̐tabŏṁdo kŏmmado māḍāḍavayya
battigalavārimīm̐dam̐ barāgu sūbudurā
(||kŏtta||)
sĕkkula vĕṁṭam̐gāresirum̐jĕmaḍaladoḍa
nikkinikki sūsīni nĕlam̐ta ninnu
vĕkkasabum̐danagŏppu vīm̐puvĕṁṭa jāram̐gānu
takkaga nimmabaṁṭam̐ dām̐kavesī ninnu
(||kŏtta||)
guṟudulai payyadalo gubbalu gānarām̐gānu
muṟibānam̐ jedulĕtti mŏkkī nīgu
taṟidoḍa mukkara gadalam̐gām̐ bĕdavulĕtti
mĕṟisi peram̐bilisī mikkili ninnu
(||kŏtta||)
adanĕṟim̐gi muṁgiḍa naṁdĕlu galluranam̐ga
yĕdurugā vachchi kānugichchī nābĕ
yidĕ śhrīveṁkaḍeśhvara ye nalamelumaṁganu
kadisi nannelidivi kāgiliṁchīm̐ dā ninnu