కొత్తపొందొ పాఁతపొందొ కొమ్మ నీ కితనితోడ
(॥పల్లవి॥)
కొత్తపొందొ పాఁతపొందొ కొమ్మ నీ కితనితోడ
బత్తితోడ నేపొద్దు పాయక వుందానవు
(॥కొత్త॥)
వాలుక చూపులఁ జూచి వట్రువగుబ్బల నొత్తి
చాలా నాతనితో సరసములాడేవు
కాలువలై చెమటలు గారఁగా వెడుకతోడ
ఆలించి వినేవు మాఁట లాసలు రేఁగఁగను
(॥కొత్త॥)
సెలవులఁ గొంత నవ్వి చేతులు పై సారెఁ జాచి
వెలయ నిందరుఁ జూడ విడే లిచ్చేవు
పులకలు చెక్కులపైఁ బొడమఁగా నాసతోడ
కొలువులు సేసుకొంటాఁ గూరిమి చల్లేవు
(॥కొత్త॥)
కప్పురముమోవినిచ్చి కాయముఁ గాయముమోవ
చిప్పిలఁ గాఁగిట నించి సేవసేసేవు
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డిట్టె నన్ను నేలే
చప్పుడుగా మొక్కి వంచనతో నుండేవు
(||pallavi||)
kŏttabŏṁdŏ pām̐tabŏṁdŏ kŏmma nī kidanidoḍa
battidoḍa nebŏddu pāyaga vuṁdānavu
(||kŏtta||)
vāluga sūbulam̐ jūsi vaṭruvagubbala nŏtti
sālā nādanido sarasamulāḍevu
kāluvalai sĕmaḍalu gāram̐gā vĕḍugadoḍa
āliṁchi vinevu mām̐ṭa lāsalu rem̐gam̐ganu
(||kŏtta||)
sĕlavulam̐ gŏṁta navvi sedulu pai sārĕm̐ jāsi
vĕlaya niṁdarum̐ jūḍa viḍe lichchevu
pulagalu sĕkkulabaim̐ bŏḍamam̐gā nāsadoḍa
kŏluvulu sesugŏṁṭām̐ gūrimi sallevu
(||kŏtta||)
kappuramumovinichchi kāyamum̐ gāyamumova
sippilam̐ gām̐giḍa niṁchi sevasesevu
yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannu nele
sappuḍugā mŏkki vaṁchanado nuṁḍevu