Kottabemdligoomturuvai komkudera vimtegaaga

కొత్తపెండ్లికూఁతురువై కొంకుదేర వింతేకాక
Language

(॥పల్లవి॥)
కొత్తపెండ్లికూఁతురువై కొంకుదేర వింతేకాక
యిత్తల నీతోడివారి నిటు చూడవే

(॥కొత్త॥)
చనవిచ్చి రమణుఁడు సన్నలు నీకుఁ జేసితే
చెనకి యేమి చూపేవే చెలులకును
యెనసి యాతఁడు నీతో నేకాంతము లాడఁగాను
పెనఁగుచు నెంతేసి బెట్టిమాట లాడేవే

(॥కొత్త॥)
యిక్కువకు వీడె మాతఁ డెఱఁగనట్టె యంపఁగా
అక్కర నేఁటికిఁ జెప్పే వందరితోను
నిక్కి చూచి గుట్టుతోడ నిమ్మపంట వేయఁగాను
చక్కఁగా నందరి నేమి సాకిరి వెట్టేవే

(॥కొత్త॥)
మూసి దాఁపిరెము గాఁగ మోవి యాతఁ డడిగితే
రాసి కొలువులో నేల రవ్వసేసేవే
ఆసతో శ్రీవేంకటేశఁ డంతలోనే నిన్ను నేలె
సేసపాలు చల్లి యేల సిగ్గువడేవే

(||pallavi||)
kŏttabĕṁḍligūm̐turuvai kŏṁkudera viṁtegāga
yittala nīdoḍivāri niḍu sūḍave

(||kŏtta||)
sanavichchi ramaṇum̐ḍu sannalu nīgum̐ jeside
sĕnagi yemi sūbeve sĕlulagunu
yĕnasi yādam̐ḍu nīdo negāṁtamu lāḍam̐gānu
pĕnam̐gusu nĕṁtesi bĕṭṭimāḍa lāḍeve

(||kŏtta||)
yikkuvagu vīḍĕ mādam̐ ḍĕṟam̐ganaṭṭĕ yaṁpam̐gā
akkara nem̐ṭigim̐ jĕppe vaṁdaridonu
nikki sūsi guṭṭudoḍa nimmabaṁṭa veyam̐gānu
sakkam̐gā naṁdari nemi sāgiri vĕṭṭeve

(||kŏtta||)
mūsi dām̐pirĕmu gām̐ga movi yādam̐ ḍaḍigide
rāsi kŏluvulo nela ravvaseseve
āsado śhrīveṁkaḍeśham̐ ḍaṁtalone ninnu nelĕ
sesabālu salli yela sigguvaḍeve