కొత్తపెండ్లికూఁతురవు కొమ్మ నీకు బుద్ది చెప్పే
(॥పల్లవి॥)
కొత్తపెండ్లికూఁతురవు కొమ్మ నీకు బుద్ది చెప్పే
యిత్తల నా మాఁట లివి యెప్పడూఁ దలఁచవే
(॥కొత్త॥)
చేరి చేరి చెనకితే చెలిమి మొగచాటౌను
సారెకుఁ గొసరితేను చవుకలౌను
మేరమీరి నవ్వితేను మిగులా వేసట వుట్టు
కూరిమిఁ బతి పొందులు గుట్టుతోనే సేయవే
(॥కొత్త॥)
సొలయఁగా సొలయఁగా సూటి పడదు నేరుపు
పలుమారు మాటాడితే పలచనౌను
పిలచి వూరకుండితే ప్రియములు జరగవు
కొలఁది యెరిఁగి పొందు గుట్టుతోనే సేయవే
(॥కొత్త॥)
వచ్చి వచ్చి తగులఁగా వలపు కొద్దీ నుండదు
పచ్చిదేరఁ గూడితేను బయలౌ సిగ్గు
యెచ్చరించి శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను గూడె
కొచ్చిన రతుల పొందు గుట్టుతోనే సేయవే
(||pallavi||)
kŏttabĕṁḍligūm̐turavu kŏmma nīgu buddi sĕppe
yittala nā mām̐ṭa livi yĕppaḍūm̐ dalam̐save
(||kŏtta||)
seri seri sĕnagide sĕlimi mŏgasāḍaunu
sārĕgum̐ gŏsaridenu savugalaunu
meramīri navvidenu migulā vesaḍa vuṭṭu
kūrimim̐ badi pŏṁdulu guṭṭudone seyave
(||kŏtta||)
sŏlayam̐gā sŏlayam̐gā sūḍi paḍadu nerubu
palumāru māḍāḍide palasanaunu
pilasi vūraguṁḍide priyamulu jaragavu
kŏlam̐di yĕrim̐gi pŏṁdu guṭṭudone seyave
(||kŏtta||)
vachchi vachchi tagulam̐gā valabu kŏddī nuṁḍadu
pachchideram̐ gūḍidenu bayalau siggu
yĕchchariṁchi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu gūḍĕ
kŏchchina radula pŏṁdu guṭṭudone seyave