Kottabemdligoomturavai guttusesugovu gaaga

కొత్తపెండ్లికూఁతురవై గుట్టుసేసుకోవు గాక
Language

(॥పల్లవి॥)
కొత్తపెండ్లికూఁతురవై గుట్టుసేసుకోవు గాక
మత్తిలి నీ మగఁడట మరి యేమి సేసునే

(॥॥)
పంతమాడి యాతఁడు నీపాదము దొక్కీనంటాను
చెంతనున్న చెలులతోఁ జెప్పుదురటె
మంతనాన నీచన్నులు మళ్లిమళ్లి చూచీనంటాఁ
నింతలో సాకిరివెట్టే విదియేమే నీవు

(॥॥)
నేరుపుతోఁ దానప్పటి నీతో నవ్వీనంటా
పేరుకొని నీదాదిఁ బిలుతురటే
చేరిచేరి చేయిముట్టి చెనకవచ్చీనంటా
బీరముతో నానలు పెట్టేవేమే నీవు

(॥॥)
అరుదై శ్రీ వేంకటేశుఁ డట్టే నిన్నుఁ గూడీనంటా
సొరిది చిలుకలకుఁ జూపుదురటే
వురముపై నేపొద్దునుండే యలమేల్మంగవు
బెరసి మాకు విడేలు పెట్టేవేమే నీవు

(||pallavi||)
kŏttabĕṁḍligūm̐turavai guṭṭusesugovu gāga
mattili nī magam̐ḍaḍa mari yemi sesune

(||||)
paṁtamāḍi yādam̐ḍu nībādamu dŏkkīnaṁṭānu
sĕṁtanunna sĕluladom̐ jĕppuduraḍĕ
maṁtanāna nīsannulu maḽlimaḽli sūsīnaṁṭām̐
niṁtalo sāgirivĕṭṭe vidiyeme nīvu

(||||)
nerubudom̐ dānappaḍi nīdo navvīnaṁṭā
perugŏni nīdādim̐ biluduraḍe
seriseri seyimuṭṭi sĕnagavachchīnaṁṭā
bīramudo nānalu pĕṭṭeveme nīvu

(||||)
arudai śhrī veṁkaḍeśhum̐ ḍaṭṭe ninnum̐ gūḍīnaṁṭā
sŏridi silugalagum̐ jūbuduraḍe
vuramubai nebŏddunuṁḍe yalamelmaṁgavu
bĕrasi māgu viḍelu pĕṭṭeveme nīvu