Kottabemdligoomtu ridi guttudodi maanisi

కొత్తపెండ్లికూఁతు రిది గుట్టుతోడి మానిసి
Language

(॥పల్లవి॥)
కొత్తపెండ్లికూఁతు రిది గుట్టుతోడి మానిసి
చిత్తగించి మెల్లనే చెనకఁగరాదా

(॥కొత్త॥)
చెక్కుచేతితోడఁ జెలి సిగ్గుపడి వుండఁగాను
వుక్కుమీరి కాతరాన వొడివట్టేవు
మక్కువతోడుతఁ దెరమఱఁగున నున్నదాని
జక్కలవలఁ బోలునంటా చన్నులంటేవు

(॥కొత్త॥)
ముసిముసినవ్వులతో మోమువంచుకుండఁగాను
సుసరాన మర్మములు సోఁకనాదేవు
పసగా నీదిక్కు చూచి భావము గరఁ(గ) గాను
కొసరికొసరి నీవు గోరఁజీమ్మేవు

(॥కొత్త॥)
చెప్పరానిమోహముతో చిమ్మిరేఁగియుండఁగాను
కప్పురముమోవినిచ్చి కాఁగిలించేవు
యిప్పుడే శ్రీవేంకటేశ యీకె నిన్నుఁ గూడెనని
చిప్పిల సరసమాడి చేత గిలిగించేవు

(||pallavi||)
kŏttabĕṁḍligūm̐tu ridi guṭṭudoḍi mānisi
sittagiṁchi mĕllane sĕnagam̐garādā

(||kŏtta||)
sĕkkusedidoḍam̐ jĕli siggubaḍi vuṁḍam̐gānu
vukkumīri kādarāna vŏḍivaṭṭevu
makkuvadoḍudam̐ dĕramaṟam̐guna nunnadāni
jakkalavalam̐ bolunaṁṭā sannulaṁṭevu

(||kŏtta||)
musimusinavvulado momuvaṁchuguṁḍam̐gānu
susarāna marmamulu som̐kanādevu
pasagā nīdikku sūsi bhāvamu garam̐(ga) gānu
kŏsarigŏsari nīvu goram̐jīmmevu

(||kŏtta||)
sĕpparānimohamudo simmirem̐giyuṁḍam̐gānu
kappuramumovinichchi kām̐giliṁchevu
yippuḍe śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍĕnani
sippila sarasamāḍi seda giligiṁchevu