కొత్తపెండ్లికూతురవా కోమలి నీవు
(॥పల్లవి॥)
కొత్తపెండ్లికూతురవా కోమలి నీవు
పొత్తుకు బిలువఁగాను పొద్దు గడపుదురా
(॥॥)
చిత్తములోపలిమాట సిగ్గులువడక పతి-
కొత్తివిన్నవించగదే వువిద నీవు
హత్తి చేయివట్టుకొని యతఁ డు పెనఁగఁ గాను
ఇత్తల నీవెంతకెంత గుట్టుసేసేవే
(॥॥)
చేసినసేఁతలకెల్లా జేరి మొగమోడితేను
వ్రాసి చూపఁగదవే వనిత నీవు
సేసవెట్టి నీమగఁడు చెంది తప్పక చూడఁ గా
రాసికెక్కె ఇంకాను శిరసు వంతురటవే
(॥॥)
తగిలి వేడుకైతే తతి శ్రీ వేంకటేశునితో
నగవే యలమేల్మంగ ననిచి నీవు
జిగి నిన్ను నీతఁడే చెలరేఁగి కూడఁగాను
మిగులా సన్నలు సేసి మేలమాడేవటవే
(||pallavi||)
kŏttabĕṁḍligūduravā komali nīvu
pŏttugu biluvam̐gānu pŏddu gaḍabudurā
(||||)
sittamulobalimāḍa sigguluvaḍaga padi-
kŏttivinnaviṁchagade vuvida nīvu
hatti seyivaṭṭugŏni yadam̐ ḍu pĕnam̐gam̐ gānu
ittala nīvĕṁtagĕṁta guṭṭuseseve
(||||)
sesinasem̐talagĕllā jeri mŏgamoḍidenu
vrāsi sūbam̐gadave vanida nīvu
sesavĕṭṭi nīmagam̐ḍu sĕṁdi tappaga sūḍam̐ gā
rāsigĕkkĕ iṁkānu śhirasu vaṁturaḍave
(||||)
tagili veḍugaide tadi śhrī veṁkaḍeśhunido
nagave yalamelmaṁga nanisi nīvu
jigi ninnu nīdam̐ḍe sĕlarem̐gi kūḍam̐gānu
migulā sannalu sesi melamāḍevaḍave