కొత్తపెండ్లికొడుకవు కొంకనేల నిఁక నేఁడు
(॥పల్లవి॥)
కొత్తపెండ్లికొడుకవు కొంకనేల నిఁక నేఁడు
చిత్తగించి రతులను చెలరేఁగవయ్యా
(॥కొత్త॥)
కలువరేకులవంటి కన్ను లాపె చూచీ నిన్ను
నెలకొని యెదుటను నిలువవయ్యా
తలకొని తేనెపెదవు లాపె విలిచీని
పలుమారు నూఁకొని పలుకవయ్యా
(॥కొత్త॥)
మొనసి చందురువంటి మొగమాపె నవ్వీని
చనవిచ్చి వలపులు చల్లవయ్యా
గునిసి కొండలు వంటి గుబ్బ లాపె చెనకీని
కనుఁగొని వేడుకతో గాఁగిలించవయ్యా
(॥కొత్త॥)
చిగురుటాకులవంటి చేతు లాపె మొక్కీని
సొగిసి మన్నన లిచ్చి చూడవయ్యా
నిగిడి శ్రీవేంకటేశ నిన్ను నిట్టె పెండ్లాడె
మగువ నన్నిటా నీవు మన్నించవయ్యా
(||pallavi||)
kŏttabĕṁḍligŏḍugavu kŏṁkanela nim̐ka nem̐ḍu
sittagiṁchi radulanu sĕlarem̐gavayyā
(||kŏtta||)
kaluvaregulavaṁṭi kannu lābĕ sūsī ninnu
nĕlagŏni yĕduḍanu niluvavayyā
talagŏni tenĕbĕdavu lābĕ vilisīni
palumāru nūm̐kŏni palugavayyā
(||kŏtta||)
mŏnasi saṁduruvaṁṭi mŏgamābĕ navvīni
sanavichchi valabulu sallavayyā
gunisi kŏṁḍalu vaṁṭi gubba lābĕ sĕnagīni
kanum̐gŏni veḍugado gām̐giliṁchavayyā
(||kŏtta||)
siguruḍāgulavaṁṭi sedu lābĕ mŏkkīni
sŏgisi mannana lichchi sūḍavayyā
nigiḍi śhrīveṁkaḍeśha ninnu niṭṭĕ pĕṁḍlāḍĕ
maguva nanniḍā nīvu manniṁchavayyā