Kottabamta paamtabamta korinaamdu nemdu neegu

కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు
Language

(॥పల్లవి॥)
కొత్తబంట పాఁతబంట కోరినాఁడు నేఁడు నీకు
యిత్తల జీతము సేసే యేలుకోవే శ్రీహరీ

(॥కొత్త॥)
యిరువదినలుగురి కిటునే గమికాఁడ
అరిదిదేహపుటూరి అమరగాఁడా
నరయక నరసేటి నల్ల తెల్లజల్లివాఁడ
యిరవై జీతము సేసి యేలుకోవే శ్రీహరీ

(॥కొత్త॥)
కామునిగరిడిలోని కటారిసామువాఁడ
లేమచూపుల పగలు దివ్వెలవాఁడా
గోమున నేకాంగి నారుగురితో నొఱటువాఁడ
యీమేటినైన నన్ను నేలుకో శ్రీహరీ

(॥కొత్త॥)
యేడునేడు లోకముల యెక్కి దిగినట్టివాఁడ
మేడెపు సంసారమున మించినవాఁడ
వోడక వెదకితి నీ వొక్కఁడవే రాజ విఁక
యీడనే శ్రీ వేంకటేశ యేలుకోవే శ్రీహరీ

(||pallavi||)
kŏttabaṁṭa pām̐tabaṁṭa korinām̐ḍu nem̐ḍu nīgu
yittala jīdamu sese yelugove śhrīharī

(||kŏtta||)
yiruvadinaluguri kiḍune gamigām̐ḍa
arididehabuḍūri amaragām̐ḍā
narayaga naraseḍi nalla tĕllajallivām̐ḍa
yiravai jīdamu sesi yelugove śhrīharī

(||kŏtta||)
kāmunigariḍiloni kaḍārisāmuvām̐ḍa
lemasūbula pagalu divvĕlavām̐ḍā
gomuna negāṁgi nārugurido nŏṟaḍuvām̐ḍa
yīmeḍinaina nannu nelugo śhrīharī

(||kŏtta||)
yeḍuneḍu logamula yĕkki diginaṭṭivām̐ḍa
meḍĕbu saṁsāramuna miṁchinavām̐ḍa
voḍaga vĕdagidi nī vŏkkam̐ḍave rāja vim̐ka
yīḍane śhrī veṁkaḍeśha yelugove śhrīharī