Kotta pomdo paamta pomdo kosari soosee ninnu

కొత్త పొందో పాఁత పొందో కొసరి చూచీ నిన్ను
Language

(॥పల్లవి॥)
కొత్త పొందో పాఁత పొందో కొసరి చూచీ నిన్ను
పొత్తులవాఁడవు నీవు పొలఁతుల కెల్లాను

(॥కొత్త॥)
వుడివోని వలపులు వొడి నించుక వున్నది
కడు నాసలు కన్నులఁ గప్పుకున్నది
బెడిదపు వినయాలు పెదవిఁ బెట్టుకున్నది
సడిఁబెట్ట కాపె దిక్కు చక్కఁ జూడవయ్యా

(॥కొత్త॥)
అందపు జవ్వనము పయ్యదలో దాఁచుకున్నది
పొందులెల్లా మనసునఁ బూఁచుకున్నది
సందిట రతిభోగాలు సవరించుక వున్నది
మందలించి యాపెతోడ మాఁటలాడవయ్యా

(॥కొత్త॥)
కోరికలు పెంచి పెంచి కొప్పు ముడుచుకున్నవి
కూరిములు లోలో గుది గుచ్చుకున్నవి
యీరీతి శ్రీవేంకటేశ యేలితి వింతలో నన్ను
దార దప్ప కాపె నిట్ట దయసేయవయ్యా

(||pallavi||)
kŏtta pŏṁdo pām̐ta pŏṁdo kŏsari sūsī ninnu
pŏttulavām̐ḍavu nīvu pŏlam̐tula kĕllānu

(||kŏtta||)
vuḍivoni valabulu vŏḍi niṁchuga vunnadi
kaḍu nāsalu kannulam̐ gappugunnadi
bĕḍidabu vinayālu pĕdavim̐ bĕṭṭugunnadi
saḍim̐bĕṭṭa kābĕ dikku sakkam̐ jūḍavayyā

(||kŏtta||)
aṁdabu javvanamu payyadalo dām̐sugunnadi
pŏṁdulĕllā manasunam̐ būm̐sugunnadi
saṁdiḍa radibhogālu savariṁchuga vunnadi
maṁdaliṁchi yābĕdoḍa mām̐ṭalāḍavayyā

(||kŏtta||)
korigalu pĕṁchi pĕṁchi kŏppu muḍusugunnavi
kūrimulu lolo gudi guchchugunnavi
yīrīdi śhrīveṁkaḍeśha yelidi viṁtalo nannu
dāra dappa kābĕ niṭṭa dayaseyavayyā