కొత్త పెండ్లికూఁతురు కొంకు దేరీఁ దేరదు
(॥పల్లవి॥)
కొత్త పెండ్లికూఁతురు కొంకు దేరీఁ దేరదు
చిత్తగించి నీవైనాఁ జేయి వట్టవయ్యా
(॥కొత్త॥)
చిమ్ముచు నీ మోము చూచీ సిగ్గుతో దగ్గరదు
కొమ్మసంగడి నీ వైనఁ గూచుండవయ్యా
కమ్మి నవ్వులును నవ్వీఁ గలసి మాటలాడదు
పమ్మి నీ వైన నాపెతోఁ బలుకవయ్యా
(॥కొత్త॥)
ఆలవట్టము విసరే నంటి ముట్టి పెనఁగదు
తేలించి యాపె వెరపు తెలపవయ్యా
కాలు దొక్కీ నిన్ను నిట్టె కాఁకదేరఁ గలయదు
పోళిమి నీవే కాఁగిటఁ బొదుగవయ్యా
(॥కొత్త॥)
తనలోనె మోహించీ దంటతనము నేరదు
ననుపులే యాకెతోడ నడపవయ్య
యెనసె శ్రీవెంకటేశ యింతినిన్ను మెల్లనె
మన సిచ్చి యిటులానె మన్నించవయ్యా
(||pallavi||)
kŏtta pĕṁḍligūm̐turu kŏṁku derīm̐ deradu
sittagiṁchi nīvainām̐ jeyi vaṭṭavayyā
(||kŏtta||)
simmusu nī momu sūsī siggudo daggaradu
kŏmmasaṁgaḍi nī vainam̐ gūsuṁḍavayyā
kammi navvulunu navvīm̐ galasi māḍalāḍadu
pammi nī vaina nābĕdom̐ balugavayyā
(||kŏtta||)
ālavaṭṭamu visare naṁṭi muṭṭi pĕnam̐gadu
teliṁchi yābĕ vĕrabu tĕlabavayyā
kālu dŏkkī ninnu niṭṭĕ kām̐kaderam̐ galayadu
poḽimi nīve kām̐giḍam̐ bŏdugavayyā
(||kŏtta||)
tanalonĕ mohiṁchī daṁṭadanamu neradu
nanubule yāgĕdoḍa naḍabavayya
yĕnasĕ śhrīvĕṁkaḍeśha yiṁtininnu mĕllanĕ
mana sichchi yiḍulānĕ manniṁchavayyā