Kosari ni nnimtalone kobagimchenaa

కొసరి ని న్నింతలోనె కోపగించేనా
Language

(॥పల్లవి॥)
కొసరి ని న్నింతలోనె కోపగించేనా
ముసిముసి నవ్వు లెల్లా ముచ్చటలె కావా

(॥కొరి॥)
తలఁపులో నీరూపు తగిలి పాయ కుండఁగ
యెలమి విరహతాప మెక్కడిది
వెలయ నిందుకుఁ గాను వేఁడుకొనే వేల నన్ను
నలువంక నీమేలె నామేలు గాదా

(॥కొరి॥)
చేకొని నీ కంకణము చేతఁ జిక్కి వుండఁ గాను
యీక డాకడి మాటకు నెగ్గు లేది
వాకున నిందుకుఁ గానె వైపులుగా నమ్మించేవు
నీకుఁ గలసంతోసమే నేఁడు నాకుఁ గాదా

(॥కొరి॥)
కందువ నీవే నాయింటఁ గాణా చై వుండఁగాను
చెంది నామనవి నీతోఁ జెప్ప నేది
అంది శ్రీవెంకటేశ నన్నలమితి కడపలో
విందుల నీవేడుకే నావేడుకలు గావా

(||pallavi||)
kŏsari ni nniṁtalonĕ kobagiṁchenā
musimusi navvu lĕllā muchchaḍalĕ kāvā

(||kŏri||)
talam̐pulo nīrūbu tagili pāya kuṁḍam̐ga
yĕlami virahadāba mĕkkaḍidi
vĕlaya niṁdugum̐ gānu vem̐ḍugŏne vela nannu
naluvaṁka nīmelĕ nāmelu gādā

(||kŏri||)
segŏni nī kaṁkaṇamu sedam̐ jikki vuṁḍam̐ gānu
yīga ḍāgaḍi māḍagu nĕggu ledi
vāguna niṁdugum̐ gānĕ vaibulugā nammiṁchevu
nīgum̐ galasaṁtosame nem̐ḍu nāgum̐ gādā

(||kŏri||)
kaṁduva nīve nāyiṁṭam̐ gāṇā sai vuṁḍam̐gānu
sĕṁdi nāmanavi nīdom̐ jĕppa nedi
aṁdi śhrīvĕṁkaḍeśha nannalamidi kaḍabalo
viṁdula nīveḍuge nāveḍugalu gāvā