కొసరి నీతోఁ బెనఁగి గునిసి మోక్ష మడుగ
(॥పల్లవి॥)
కొసరి నీతోఁ బెనఁగి గునిసి మోక్ష మడుగ
వెస నీబంట నింతే నీవే దిక్కు నాకు
(॥కొరి॥)
బలిమి నీ బిడ్డఁడైన బ్రహ్మంతవాఁడనా
అల సముద్రుఁడు మామ యంత వాఁడనా
చలువైన నీ మఱఁది చంద్రునంతవాఁడనా
యెలమి నీతోఁ బుట్టిన యింద్రునంతవాఁడనా
(॥కొరి॥)
చనువున మీ తండ్రి కశ్యపునంతవాఁడనా
అనుజుఁడైన లక్ష్మణునంతవాఁడనా
మనవికి మీ బావ ధర్మజునంతవాఁడనా
అనుఁగు దాతయైన భీష్మునంతవాఁడనా
(॥కొరి॥)
మనికైన యల్లుఁ డభిమన్యునంతవాఁడనా
అనిరుద్ధుఁడు మనుమఁడంతవాఁడనా
ఘనుఁడ శ్రీవేంకటేశ కల్పించి నీ వాడించఁగా
పనిపూని మెలఁగేటి పత్రిమను నేను
(||pallavi||)
kŏsari nīdom̐ bĕnam̐gi gunisi mokṣha maḍuga
vĕsa nībaṁṭa niṁte nīve dikku nāgu
(||kŏri||)
balimi nī biḍḍam̐ḍaina brahmaṁtavām̐ḍanā
ala samudrum̐ḍu māma yaṁta vām̐ḍanā
saluvaina nī maṟam̐di saṁdrunaṁtavām̐ḍanā
yĕlami nīdom̐ buṭṭina yiṁdrunaṁtavām̐ḍanā
(||kŏri||)
sanuvuna mī taṁḍri kaśhyabunaṁtavām̐ḍanā
anujum̐ḍaina lakṣhmaṇunaṁtavām̐ḍanā
manavigi mī bāva dharmajunaṁtavām̐ḍanā
anum̐gu dādayaina bhīṣhmunaṁtavām̐ḍanā
(||kŏri||)
manigaina yallum̐ ḍabhimanyunaṁtavām̐ḍanā
aniruddhum̐ḍu manumam̐ḍaṁtavām̐ḍanā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalbiṁchi nī vāḍiṁcham̐gā
panibūni mĕlam̐geḍi patrimanu nenu