కొసరి కొసరి నీవే కొంచేవు గాక
(॥పల్లవి॥)
కొసరి కొసరి నీవే కొంచేవు గాక
పసలు మీరఁగ నొడఁబరచేవు నన్నును
(॥కొసరి॥)
సారె మోవేమి చూపేవు చవులేల చెప్పేవు
గారవించి నీవియ్యఁగాఁ గాదంటినా
కేరి నవ్వుతా నాచన్ను గిరు లెంత పొగడేవు
యేరీతులా నీకవి మీఁదెత్తినవే కావా
(॥కొసరి॥)
సన్న లేమి సేసేవు చనవెంత యిచ్చేవు
వన్నెతో నన్నుఁ గూడగా వలదంటినా
మన్నించి వద్దఁ గూచుండి మచ్చికలు నెరుపేవు
అన్నిటా తొల్లే నీ కిల్లాల నౌ తెరఁగవా
(॥కొసరి॥)
సాములేల చేసేవు సందు లేల వెదకేవు
ప్రేమతో నీ వేలితివి బిగిసితినా
ఆముక శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
నే మొక్కితే మెచ్చేవు నేఁడు నీకుఁ గొత్తలా
(||pallavi||)
kŏsari kŏsari nīve kŏṁchevu gāga
pasalu mīram̐ga nŏḍam̐barasevu nannunu
(||kŏsari||)
sārĕ movemi sūbevu savulela sĕppevu
gāraviṁchi nīviyyam̐gām̐ gādaṁṭinā
keri navvudā nāsannu giru lĕṁta pŏgaḍevu
yerīdulā nīgavi mīm̐dĕttinave kāvā
(||kŏsari||)
sanna lemi sesevu sanavĕṁta yichchevu
vannĕdo nannum̐ gūḍagā valadaṁṭinā
manniṁchi vaddam̐ gūsuṁḍi machchigalu nĕrubevu
anniḍā tŏlle nī killāla nau tĕram̐gavā
(||kŏsari||)
sāmulela sesevu saṁdu lela vĕdagevu
premado nī velidivi bigisidinā
āmuga śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
ne mŏkkide mĕchchevu nem̐ḍu nīgum̐ gŏttalā