కోరో కోరో రారో కోరి విడేలు
(॥పల్లవి॥)
కోరో కోరో రారో కోరి విడేలు
సారె సారె నిందరికిఁ జాటితిమి సుండి
(॥॥)
పాలవారి పిన్నదాని బలిమిఁ బెండ్లి సేయఁగ
నాలఁ గాచే శ్రీ కృష్ణుఁనికే నడిగేరు
వోలివెట్టి అంతలోనె వుంగరముఁ బెట్టినారు
నీలవర్ణు సోబనము నేఁడే సుండి
(॥॥)
చందమామ తోఁబుట్టుగు సరి నందగోపుని
నందనునికినిఁ బొంతనాలు చూచిరి
డిందుపడ నిద్దరికి తెర ఇట్టే పట్టినారు
అందియ్యరో తలఁబాల కాయిత్తము సుండి
(॥॥)
జలధిరాజు కూఁతురు సరి శ్రీ వేంకటపతి
నెలమితో వీదు లెల్ల నేఁగించినారు
కొలము కొలముఁ గూడి కొంగులు ముడిచినారు
తలఁపఁ జక్కఁ దనాలు తగుఁ జుండి.
(||pallavi||)
koro koro rāro kori viḍelu
sārĕ sārĕ niṁdarigim̐ jāḍidimi suṁḍi
(||||)
pālavāri pinnadāni balimim̐ bĕṁḍli seyam̐ga
nālam̐ gāse śhrī kṛṣhṇum̐nige naḍigeru
volivĕṭṭi aṁtalonĕ vuṁgaramum̐ bĕṭṭināru
nīlavarṇu sobanamu nem̐ḍe suṁḍi
(||||)
saṁdamāma tom̐buṭṭugu sari naṁdagobuni
naṁdanuniginim̐ bŏṁtanālu sūsiri
ḍiṁdubaḍa niddarigi tĕra iṭṭe paṭṭināru
aṁdiyyaro talam̐bāla kāyittamu suṁḍi
(||||)
jaladhirāju kūm̐turu sari śhrī veṁkaḍabadi
nĕlamido vīdu lĕlla nem̐giṁchināru
kŏlamu kŏlamum̐ gūḍi kŏṁgulu muḍisināru
talam̐pam̐ jakkam̐ danālu tagum̐ juṁḍi.