కోరినట్టె వున్నవారు కొమ్మలు ముయ్యీడువారు
(॥పల్లవి॥)
కోరినట్టె వున్నవారు కొమ్మలు ముయ్యీడువారు
గారవపు గొల్లజాతి కలిగెఁగా నీ కిందుకే
(॥కోరి॥)
మెరవడికతైలైన మెలుఁతలే నీకు బాఁతి
కరకరిఁబెట్టేటి కాంతలే బాఁతి
సరి నిన్నుఁబనిగొనేజారకాంతలే బాఁతి
గరిమ రేపల్లెనుఁ గలరుగా యిందుకే
(॥కోరి॥)
జిడ్డువలె నంటుకొనేచెలులే నీకుఁ బ్రియము
వొడ్డారపుసతులే నీకొగిఁ బ్రియము
యెడ్డతనపుమాటల ఇంతులే నీకుఁ బ్రియము
దొడ్డిమంద లిందుకే దొరకెఁగా నీకును
(॥కోరి॥)
తామే తేరకువచ్చినతరుణులు నీకు నింపు
కామించి సిగ్గులేని కాంత లింపు
యీమేర శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
ఆమని రాసక్రీడ లబ్బెఁగా నీకును
(||pallavi||)
korinaṭṭĕ vunnavāru kŏmmalu muyyīḍuvāru
gāravabu gŏllajādi kaligĕm̐gā nī kiṁduge
(||kori||)
mĕravaḍigadailaina mĕlum̐tale nīgu bām̐ti
karagarim̐bĕṭṭeḍi kāṁtale bām̐ti
sari ninnum̐banigŏnejāragāṁtale bām̐ti
garima reballĕnum̐ galarugā yiṁduge
(||kori||)
jiḍḍuvalĕ naṁṭugŏnesĕlule nīgum̐ briyamu
vŏḍḍārabusadule nīgŏgim̐ briyamu
yĕḍḍadanabumāḍala iṁtule nīgum̐ briyamu
dŏḍḍimaṁda liṁduge dŏragĕm̐gā nīgunu
(||kori||)
tāme teraguvachchinadaruṇulu nīgu niṁpu
kāmiṁchi sigguleni kāṁta liṁpu
yīmera śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
āmani rāsakrīḍa labbĕm̐gā nīgunu