కోరికెలెల్లా నీడేరె గోవిందరాజా
(॥పల్లవి॥)
కోరికెలెల్లా నీడేరె గోవిందరాజా
యీ రీతి సతుల నెనయఁగఁ గలిగె
(॥కోరి॥)
చిడుముడి నీవు నాల్గు చేతులతో మెరసేది
వుడివోక మాకు నొక్కవుపమ వుట్టె
పడఁతులిద్దరు నీకుఁ బాదము లొత్తఁగాను
కడఁగి నీ వొకమాటే కాఁగిలించఁగలిగె
(॥కోరి॥)
గక్కన కఠినమైన కౌస్తుభమాణికము
అక్కునఁగట్టిన దొక అనువువచ్చె
చక్కఁగా నిద్దరినాల్గుచనుఁగొండ లొక్కమాఁటే
వుక్కుమీర నొరయఁగ నోరువఁగఁగలిగె
(॥కోరి॥)
తావై శ్రీవేంకటేశ వొత్తగిలి పవ్వళించేది
వోవరిలో నిది యొక్కవుపమకెక్కె
యీవలనావల భూమి నిందిర నీఁపు నురము
చేవమరీ చేకొనఁగ జిగిఁ గూడఁగలిగె
(||pallavi||)
korigĕlĕllā nīḍerĕ goviṁdarājā
yī rīdi sadula nĕnayam̐gam̐ galigĕ
(||kori||)
siḍumuḍi nīvu nālgu sedulado mĕrasedi
vuḍivoga māgu nŏkkavubama vuṭṭĕ
paḍam̐tuliddaru nīgum̐ bādamu lŏttam̐gānu
kaḍam̐gi nī vŏgamāḍe kām̐giliṁcham̐galigĕ
(||kori||)
gakkana kaṭhinamaina kaustubhamāṇigamu
akkunam̐gaṭṭina dŏga anuvuvachchĕ
sakkam̐gā niddarinālgusanum̐gŏṁḍa lŏkkamām̐ṭe
vukkumīra nŏrayam̐ga noruvam̐gam̐galigĕ
(||kori||)
tāvai śhrīveṁkaḍeśha vŏttagili pavvaḽiṁchedi
vovarilo nidi yŏkkavubamagĕkkĕ
yīvalanāvala bhūmi niṁdira nīm̐pu nuramu
sevamarī segŏnam̐ga jigim̐ gūḍam̐galigĕ