Korige leedere nimkaa gosaru lele

కోరికె లీడేరె నింకా గొసరు లేలే
Language

(॥పల్లవి॥)
కోరికె లీడేరె నింకా గొసరు లేలే
యీ రీతి నితఁడు నీవు నెనయుట గాకా

(॥॥)
తలఁచిన తలఁపులు దై వారి లోలోన
వలచిన వలపులు వాఁట మాయను
మొలచిన చన్నులు మోసులెత్తెఁ బయ్యదలో
యెలమిఁ దెరమఱుఁగు లింక నేలే నీకు

(॥॥)
జవ్వన మదము మేన జారీఁ జెమటలై
నవ్వులు సెలవులను నారుకొనెను
పువ్వుల తోడి తురుము బుజము పై వీడుపడే
యివ్వల నీ తమి దాఁచ నిఁక నేలే నీకు

(॥॥)
సురతపు టాసలు చూపులలోఁ బెనగొని
గరిమఁ బొందులు పులకలఁ జూపెను
యిరవై శ్రీ వేంకటేశుఁడింతలోన నిన్నుఁ గూడె
యెరవుల నిండు సిగ్గు లిఁక నేలే నీకు

(||pallavi||)
korigĕ līḍerĕ niṁkā gŏsaru lele
yī rīdi nidam̐ḍu nīvu nĕnayuḍa gāgā

(||||)
talam̐sina talam̐pulu dai vāri lolona
valasina valabulu vām̐ṭa māyanu
mŏlasina sannulu mosulĕttĕm̐ bayyadalo
yĕlamim̐ dĕramaṟum̐gu liṁka nele nīgu

(||||)
javvana madamu mena jārīm̐ jĕmaḍalai
navvulu sĕlavulanu nārugŏnĕnu
puvvula toḍi turumu bujamu pai vīḍubaḍe
yivvala nī tami dām̐sa nim̐ka nele nīgu

(||||)
suradabu ṭāsalu sūbulalom̐ bĕnagŏni
garimam̐ bŏṁdulu pulagalam̐ jūbĕnu
yiravai śhrī veṁkaḍeśhum̐ḍiṁtalona ninnum̐ gūḍĕ
yĕravula niṁḍu siggu lim̐ka nele nīgu