Korige leedere nemdu konediraaya | itte

కోరికె లీడేరె నేఁడు కోనేటిరాయ । ఇట్టె
Language

(॥పల్లవి॥)
కోరికె లీడేరె నేఁడు కోనేటిరాయ । ఇట్టె
కూరిముల వూటుకూరి కోనేటిరాయ

(॥కోరి॥)
కుమ్మరించేవు సిగ్గులు కోనేటిరాయ । యీ -
కొమ్మలెల్లఁ జూడఁగాను కోనేటిరాయ
కొమ్మువంటి కొనగోరఁ గోనేటిరాయ । మేను
కుమ్మెలుగా నొత్తకుమీ కోనేటిరాయ

(॥కోరి॥)
కొప్పుగడు వెడజారె కోనేటిరాయ । నిండా
గుప్పేవు సెలవినవ్వు కోనేటిరాయా
కుప్పళింపుఁ జెమటలగోనేటిరాయ । యెంత
గొప్పవాఁడవయ్య నీవు కోనేటిరాయ

(॥కోరి॥)
కొండికపాయ మమరెఁ గోనేటిరాయ । పైఁడి
గొండెలపచ్చడముతో గోనేటిరాయ
అండనే శ్రీవేంకటాద్రి నలరి నన్నేలితివి
కొండలలో నెలకొన్న కోనేటిరాయ

(||pallavi||)
korigĕ līḍerĕ nem̐ḍu koneḍirāya | iṭṭĕ
kūrimula vūḍugūri koneḍirāya

(||kori||)
kummariṁchevu siggulu koneḍirāya | yī -
kŏmmalĕllam̐ jūḍam̐gānu koneḍirāya
kŏmmuvaṁṭi kŏnagoram̐ goneḍirāya | menu
kummĕlugā nŏttagumī koneḍirāya

(||kori||)
kŏppugaḍu vĕḍajārĕ koneḍirāya | niṁḍā
guppevu sĕlavinavvu koneḍirāyā
kuppaḽiṁpum̐ jĕmaḍalagoneḍirāya | yĕṁta
gŏppavām̐ḍavayya nīvu koneḍirāya

(||kori||)
kŏṁḍigabāya mamarĕm̐ goneḍirāya | paim̐ḍi
gŏṁḍĕlabachchaḍamudo goneḍirāya
aṁḍane śhrīveṁkaḍādri nalari nannelidivi
kŏṁḍalalo nĕlagŏnna koneḍirāya