కోరికలు కొనసాగె గోవిందరాజ
(॥పల్లవి॥)
కోరికలు కొనసాగె గోవిందరాజ
మేరమీరి ఇట్లానే మెరసితివా
(॥కోరి॥)
బాలుఁడవై రేపల్లెలోఁ బాలుదాగేవేళ
యీలీలలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లెత లూఁచి పాడఁగా
ఆలకించి విని పాట లవధరించితివా
(॥కోరి॥)
కొంచక మధురలోనఁ గుబ్బఇంట నీలాగుల
మంచాలపైఁ బవళించి మరిగితివా
చంచులద్వారకలోన సత్య బామతొడమీఁద
ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా
(॥కోరి॥)
పరియారువేలింతులపాలిండ్లు తలగడలై
పొందల నిటువలనే భోగించితివా
యెదుల శ్రీవేంకటేశ ఇట్టె తిరుపతిలోన
నిదిరించక శ్రీభూమినీళలఁ గూడితివా
(||pallavi||)
korigalu kŏnasāgĕ goviṁdarāja
meramīri iṭlāne mĕrasidivā
(||kori||)
bālum̐ḍavai reballĕlom̐ bāludāgeveḽa
yīlīlalane pavaḽiṁchi yiravaidivā
golavai tŏṭṭĕlalona gŏllĕda lūm̐si pāḍam̐gā
ālagiṁchi vini pāḍa lavadhariṁchidivā
(||kori||)
kŏṁchaga madhuralonam̐ gubba̮iṁṭa nīlāgula
maṁchālabaim̐ bavaḽiṁchi marigidivā
saṁchuladvāragalona satya bāmadŏḍamīm̐da
muṁchi yīrīdi nŏragi muchchaḍalāḍidivā
(||kori||)
pariyāruveliṁtulabāliṁḍlu talagaḍalai
pŏṁdala niḍuvalane bhogiṁchidivā
yĕdula śhrīveṁkaḍeśha iṭṭĕ tirubadilona
nidiriṁchaga śhrībhūminīḽalam̐ gūḍidivā