కోరిక లీడేరె నిఁకఁ గూచుండవయ్యా
(॥పల్లవి॥)
కోరిక లీడేరె నిఁకఁ గూచుండవయ్యా
సారె సారె నందుకుఁగా జలపట్టనేఁటికి
(॥॥)
యింతలోనే విభుఁడు నీ వింటికి విచ్చేసితివి
పంతపుమాఁటల కికఁ బనిలేదు
వంతుకు వచ్చినయాపె వద్దనే నిలుచున్నది
సంతోసించవలెఁగాని సాదించనేఁటికి
(॥॥)
దప్పిదేర చెక్కునొక్కి తమ్ముల మిడితివి
తప్పులు నీపయి నెంచఁదగవుగాదు
చెప్పరానిగుట్టుతోడ చేసన్న చేసీ నాపె
వొప్పనాయ నీవలపు వుప్పతించనేఁటికి
(॥॥)
కన్నులనే నవ్వి నన్నుఁ గాఁగిట నించితివి
విన్నపాలుసేయ నిది వేళ గాదు
వున్నతి శ్రీ వేంకటేశ వూరకే మొక్కీ నాకె
మన్ననలు దయివారె మతకములేఁటికి
(||pallavi||)
koriga līḍerĕ nim̐kam̐ gūsuṁḍavayyā
sārĕ sārĕ naṁdugum̐gā jalabaṭṭanem̐ṭigi
(||||)
yiṁtalone vibhum̐ḍu nī viṁṭigi vichchesidivi
paṁtabumām̐ṭala kigam̐ baniledu
vaṁtugu vachchinayābĕ vaddane nilusunnadi
saṁtosiṁchavalĕm̐gāni sādiṁchanem̐ṭigi
(||||)
dappidera sĕkkunŏkki tammula miḍidivi
tappulu nībayi nĕṁcham̐dagavugādu
sĕpparāniguṭṭudoḍa sesanna sesī nābĕ
vŏppanāya nīvalabu vuppadiṁchanem̐ṭigi
(||||)
kannulane navvi nannum̐ gām̐giḍa niṁchidivi
vinnabāluseya nidi veḽa gādu
vunnadi śhrī veṁkaḍeśha vūrage mŏkkī nāgĕ
mannanalu dayivārĕ madagamulem̐ṭigi