కోరి ని న్నిదెఱఁగక కోపగించుకొంటిఁ గాక
(॥పల్లవి॥)
కోరి ని న్నిదెఱఁగక కోపగించుకొంటిఁ గాక
నేరుపెంత లేకుండితే నీవు నన్నంటుదువా
(॥కోరి॥)
అంది వాదులకు రావు ఆఱడిఁబెట్టుకొనవు
యెందుకైనా నౌదువు ఇది మేలయ్యా
అందగాఁడ విటువంటిఆతఁడవుగాకుండితే
చెంది మున్ను సేసినట్టిచేఁతలెల్లఁ జెల్లునా
(॥కోరి॥)
వోపనన వేమిటికి వొద్ద నెవ్వరుండినాను
యేపనైనాఁ జేసేవు ఇది మేలయ్య
వైపరివి ఇటువంటివాఁడవు గాకుండితేను
రాపుల నిన్నిందరును రసికుఁడవందురా
(॥కోరి॥)
వట్టిసిగ్గులు వడవు వాసులెంచవు నాయెడ
యిట్టె కాఁగిటఁ గూడితి విది మేలయ్య
ముట్టి శ్రీవేంకటేశుఁడ మోహ మింత లేకుండితే
జట్టిగొని నీమేలు సతులెల్ల మెత్తురా
(||pallavi||)
kori ni nnidĕṟam̐gaga kobagiṁchugŏṁṭim̐ gāga
nerubĕṁta leguṁḍide nīvu nannaṁṭuduvā
(||kori||)
aṁdi vādulagu rāvu āṟaḍim̐bĕṭṭugŏnavu
yĕṁdugainā nauduvu idi melayyā
aṁdagām̐ḍa viḍuvaṁṭiādam̐ḍavugāguṁḍide
sĕṁdi munnu sesinaṭṭisem̐talĕllam̐ jĕllunā
(||kori||)
vobanana vemiḍigi vŏdda nĕvvaruṁḍinānu
yebanainām̐ jesevu idi melayya
vaibarivi iḍuvaṁṭivām̐ḍavu gāguṁḍidenu
rābula ninniṁdarunu rasigum̐ḍavaṁdurā
(||kori||)
vaṭṭisiggulu vaḍavu vāsulĕṁchavu nāyĕḍa
yiṭṭĕ kām̐giḍam̐ gūḍidi vidi melayya
muṭṭi śhrīveṁkaḍeśhum̐ḍa moha miṁta leguṁḍide
jaṭṭigŏni nīmelu sadulĕlla mĕtturā