కోరి నీ యీవికి దొడ్డఁ గొంచెము లేదు
(॥పల్లవి॥)
కోరి నీ యీవికి దొడ్డఁ గొంచెము లేదు
ధారుణిలో నీ సరి దాతలు వేరీ
(॥కోరి॥)
వుత్తానపాదునికొడుకొగి నుతియించు టెంత
బత్తితో నీ విచ్చు ధ్రువపట్టమెంతా
హత్తి పిలువవచ్చిన యక్రూరుపని యెంత
సత్తుగా నీ రూపు చూపి చన విచ్చు టెంతా
(॥కోరి॥)
వొట్టి యంబరీషుడున్న వుపవాసమది యెంత
అట్టె చక్రము రక్షగా నంపు టెంతా
గుట్టునఁ గాముకులైన గోపికలు గూడు టెంత
నెట్టన నిహపరాలు నీ విచ్చు టెంతా
(॥కోరి॥)
తలఁచి గుహుఁడు వోడ దాఁటించినమాత్ర మెంత
సులభాన నిండుఁ గృపఁజూచుట యెంతా
బలిమి శ్రీవేంకటేశ పరుషలకా నీ కెంత
వలసినట్టు నీ విచ్చు వరము లివి యెంతా
(||pallavi||)
kori nī yīvigi dŏḍḍam̐ gŏṁchĕmu ledu
dhāruṇilo nī sari dādalu verī
(||kori||)
vuttānabādunigŏḍugŏgi nudiyiṁchu ṭĕṁta
battido nī vichchu dhruvabaṭṭamĕṁtā
hatti piluvavachchina yakrūrubani yĕṁta
sattugā nī rūbu sūbi sana vichchu ṭĕṁtā
(||kori||)
vŏṭṭi yaṁbarīṣhuḍunna vubavāsamadi yĕṁta
aṭṭĕ sakramu rakṣhagā naṁpu ṭĕṁtā
guṭṭunam̐ gāmugulaina gobigalu gūḍu ṭĕṁta
nĕṭṭana nihabarālu nī vichchu ṭĕṁtā
(||kori||)
talam̐si guhum̐ḍu voḍa dām̐ṭiṁchinamātra mĕṁta
sulabhāna niṁḍum̐ gṛpam̐jūsuḍa yĕṁtā
balimi śhrīveṁkaḍeśha paruṣhalagā nī kĕṁta
valasinaṭṭu nī vichchu varamu livi yĕṁtā