కోరి మమ్ము నీ వేల కొంగువట్టేవు
(॥పల్లవి॥)
కోరి మమ్ము నీ వేల కొంగువట్టేవు
బీరపు సవతులెల్లాఁ బెనఁగఁగ వలదా
(॥కోరి॥)
కొలువులో నాపె నీకుఁ గోరి కొప్పు దువ్వఁగాను
చెలు లండ నుండేది సిగ్గుగాదా
చలపట్టి యప్పటిని సరసమూ నాడఁగాను
తిలకించినవారెల్లా తెరవేయ వలదా
(॥కోరి॥)
పనివడి వొయ్యనె నీ పాదము లాపె వొత్తఁగా
ననుపునఁ బెరవవారు నవ్వవచ్చునా
తనివి నొందక నీతోఁ దగ మాటాలాడఁగాను
వెనకటిసతులెల్లా వెలి నుండవలదా
(॥కోరి॥)
కమ్మటిని సారె నాపె కాఁగిలించుకొనఁగాను
నెమ్మదిఁ గడమవారు నిక్కి చూచేరా
యిమ్ముల శ్రీ వేంకటేశ ఇందుకే నీ వేలితివి
సమ్మతించి లోలోనే సంతోసించ వలదా
(||pallavi||)
kori mammu nī vela kŏṁguvaṭṭevu
bīrabu savadulĕllām̐ bĕnam̐gam̐ga valadā
(||kori||)
kŏluvulo nābĕ nīgum̐ gori kŏppu duvvam̐gānu
sĕlu laṁḍa nuṁḍedi siggugādā
salabaṭṭi yappaḍini sarasamū nāḍam̐gānu
tilagiṁchinavārĕllā tĕraveya valadā
(||kori||)
panivaḍi vŏyyanĕ nī pādamu lābĕ vŏttam̐gā
nanubunam̐ bĕravavāru navvavachchunā
tanivi nŏṁdaga nīdom̐ daga māḍālāḍam̐gānu
vĕnagaḍisadulĕllā vĕli nuṁḍavaladā
(||kori||)
kammaḍini sārĕ nābĕ kām̐giliṁchugŏnam̐gānu
nĕmmadim̐ gaḍamavāru nikki sūserā
yimmula śhrī veṁkaḍeśha iṁduge nī velidivi
sammadiṁchi lolone saṁtosiṁcha valadā