Kori maabhujamula daagulu mosugunnaaramu

కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము
Language

(॥పల్లవి॥)
కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము
ధారుణిలోపల మమ్ము దయఁజూచుఁ గాక

(॥కోరి॥)
సతతము హరిచేతి శంఖచక్రములే
గతియై మాపాలనుండి కాచుఁ గాక
అతిరయమైనట్టిఅచ్యుతుని ఆయుధాలే
హితవుగ మమ్ము నిట్టె యేలుఁ గాక

(॥కోరి॥)
కమలాపతిచేతుల గదాపద్మములు
మమకారముతో మము మన్నించుఁ గాక
సమరవిజయమైన శార్ఙ్గాదిశరములు
తమితోడ మాకు దాపుదండై వుండుఁ గాక

(॥కోరి॥)
ముంచి శ్రీవేంకటేశుఁడు మొలఁగట్టిన కఠారు
అంచెల మాకెల్ల రక్షై అమరుఁ గాక
అంచ నీతని కైదువులమరిన హస్తములు
పంచల మాకిట్టే వజ్రపంజరా లవుఁ గాక

(||pallavi||)
kori mābhujamula ḍāgulu mosugunnāramu
dhāruṇilobala mammu dayam̐jūsum̐ gāga

(||kori||)
sadatamu harisedi śhaṁkhasakramule
gadiyai mābālanuṁḍi kāsum̐ gāga
adirayamainaṭṭiachyuduni āyudhāle
hidavuga mammu niṭṭĕ yelum̐ gāga

(||kori||)
kamalābadisedula gadābadmamulu
mamagāramudo mamu manniṁchum̐ gāga
samaravijayamaina śhārṅgādiśharamulu
tamidoḍa māgu dābudaṁḍai vuṁḍum̐ gāga

(||kori||)
muṁchi śhrīveṁkaḍeśhum̐ḍu mŏlam̐gaṭṭina kaṭhāru
aṁchĕla māgĕlla rakṣhai amarum̐ gāga
aṁcha nīdani kaiduvulamarina hastamulu
paṁchala māgiṭṭe vajrabaṁjarā lavum̐ gāga