కోరి ధర్మము చాలు కుక్కఁ బట్టుమన్న రీతి
(॥పల్లవి॥)
కోరి ధర్మము చాలు కుక్కఁ బట్టుమన్న రీతి
యీ రీతి నింత సేసితి వింత చాలదా
(॥కోరి॥)
చక్కఁగా నన్నొక హీనజంతువుఁగాఁ బుట్టించక
యెక్కువ నరునిఁ జేసి తింత చాలదా
దిక్కుల నిది చాలక దివ్యభోగముగోర
అక్కర నా కొక ఆసోదమా
(॥కోరి॥)
పాతకాలు సేసేటి పరుల బంటుఁ జేయక
యీతల నీ బంటుఁ జేసి తిది చాలదా
ఆతల నీవద్ది సనకాదుల పదవి గోర
ఆతుమలో నా కొక ఆసోదమా
(॥కోరి॥)
నరక మనుభవించ నన్ను నందు నిలుపక
యిరవై యిహ మిచ్చి తిది చాలదా
ధర శ్రీ వేంకటపతి తగ నీకు శరణంటి
పరము గోరను యింకా నప్పటి నాసోదమా
(||pallavi||)
kori dharmamu sālu kukkam̐ baṭṭumanna rīdi
yī rīdi niṁta sesidi viṁta sāladā
(||kori||)
sakkam̐gā nannŏga hīnajaṁtuvum̐gām̐ buṭṭiṁchaga
yĕkkuva narunim̐ jesi tiṁta sāladā
dikkula nidi sālaga divyabhogamugora
akkara nā kŏga āsodamā
(||kori||)
pādagālu seseḍi parula baṁṭum̐ jeyaga
yīdala nī baṁṭum̐ jesi tidi sāladā
ādala nīvaddi sanagādula padavi gora
ādumalo nā kŏga āsodamā
(||kori||)
naraga manubhaviṁcha nannu naṁdu nilubaga
yiravai yiha michchi tidi sāladā
dhara śhrī veṁkaḍabadi taga nīgu śharaṇaṁṭi
paramu goranu yiṁkā nappaḍi nāsodamā