కోరి బిడ్డఁడంటాఁ గంటి గోవిందుని
(॥పల్లవి॥)
కోరి బిడ్డఁడంటాఁ గంటి గోవిందుని
సారెసారె దూరనేల చందమాయనే
(॥కోరి॥)
వెల్లిమడుగు లీఁదఁబోవు వెడఁగు కొండ లెత్తఁబోవు
చుల్లరీఁడు మా కుంలదు సురిగి తిరుగునే
వల్లెతాట రోలఁగట్టువరచినను పరచినను
యెల్లనాఁడు మానఁడింక నేమిసేతువే
(॥కోరి॥)
వేఁడుకొనఁ బెచ్చుపెరుగు వెరపఁ డింత తల్లికైన
వాఁడియడవిఁ దిరుగు బండి వాలఁదన్నెనే
పోఁడిమలర నెంత నేము బుద్ది చెప్పినాడువినఁడు
వీడేటి బాలుఁడమ్మ వింత చూడరే
(॥కోరి॥)
చెలులనెల్ల బంగపెట్టి చేఁతలందె కలికియాయ
పులుమీఁద నెక్కి తోలి పుడమి వెలసెను
మెలఁగి శ్రీవేంకటాద్రిమీఁద నిలిచె వింతలోనె
యెలమి నతఁడు చేయుచేఁతలెల్లఁ గంటిరే
(||pallavi||)
kori biḍḍam̐ḍaṁṭām̐ gaṁṭi goviṁduni
sārĕsārĕ dūranela saṁdamāyane
(||kori||)
vĕllimaḍugu līm̐dam̐bovu vĕḍam̐gu kŏṁḍa lĕttam̐bovu
sullarīm̐ḍu mā kuṁladu surigi tirugune
vallĕdāḍa rolam̐gaṭṭuvarasinanu parasinanu
yĕllanām̐ḍu mānam̐ḍiṁka nemiseduve
(||kori||)
vem̐ḍugŏnam̐ bĕchchubĕrugu vĕrabam̐ ḍiṁta talligaina
vām̐ḍiyaḍavim̐ dirugu baṁḍi vālam̐dannĕne
pom̐ḍimalara nĕṁta nemu buddi sĕppināḍuvinam̐ḍu
vīḍeḍi bālum̐ḍamma viṁta sūḍare
(||kori||)
sĕlulanĕlla baṁgabĕṭṭi sem̐talaṁdĕ kaligiyāya
pulumīm̐da nĕkki toli puḍami vĕlasĕnu
mĕlam̐gi śhrīveṁkaḍādrimīm̐da nilisĕ viṁtalonĕ
yĕlami nadam̐ḍu seyusem̐talĕllam̐ gaṁṭire