Koppudaavi saare saare kuppalimchavalasi

కొప్పుతావి సారె సారె కుప్పళించవలసి
Language

(॥పల్లవి॥)
కొప్పుతావి సారె సారె కుప్పళించవలసి
అప్పటి నీ(టిని) మారుమొగమయ్యేవాతనికి

(॥కొప్పు॥)
భారపు నీ గుబ్బల సంపద చూపవలసి
వోరగా నొరగుమీఁద నొరగేవు
తోరపు నీకన్నుల యేతులె చూపవలసి
సారెకు చూపులఁ బగచాటేవాతనిని

(॥కొప్పు॥)
తట్టెడి నీమట్టెలమోఁతలు చూపవలసి
పట్టఁబట్టఁ గానే పుష్పరిగెక్కేవు
వట్టి నీకోపాన చెలువము చూపవలసి
పెట్టినహరముల గుంపెనలఁ దీసేవు

(॥కొప్పు॥)
తొయ్యలి నీ మేని మృదువు చూపవలసి
కయ్యపు వేంకటపతిఁ గౌఁగిలించేవు
చయ్యననే నీ సరసము చూపవలసి
చయ్యాటములనె యిట్టె జంపులనేచేవు

(||pallavi||)
kŏppudāvi sārĕ sārĕ kuppaḽiṁchavalasi
appaḍi nī(ṭini) mārumŏgamayyevādanigi

(||kŏppu||)
bhārabu nī gubbala saṁpada sūbavalasi
voragā nŏragumīm̐da nŏragevu
torabu nīgannula yedulĕ sūbavalasi
sārĕgu sūbulam̐ bagasāḍevādanini

(||kŏppu||)
taṭṭĕḍi nīmaṭṭĕlamom̐talu sūbavalasi
paṭṭam̐baṭṭam̐ gāne puṣhparigĕkkevu
vaṭṭi nīgobāna sĕluvamu sūbavalasi
pĕṭṭinaharamula guṁpĕnalam̐ dīsevu

(||kŏppu||)
tŏyyali nī meni mṛduvu sūbavalasi
kayyabu veṁkaḍabadim̐ gaum̐giliṁchevu
sayyanane nī sarasamu sūbavalasi
sayyāḍamulanĕ yiṭṭĕ jaṁpulanesevu