కొప్పు వంగ నీ వెంతైనా గోవిందరాజా । పైఁడి
(॥పల్లవి॥)
కొప్పు వంగ నీ వెంతైనా గోవిందరాజా । పైఁడి-
కుప్పెకఠారము వట్టి గోవిందరాజా
(॥కొప్పు॥)
నిద్దిరించేనంనటాను నెలఁతలచేఁబాదాలు
గుద్దించుకొనే విప్పుడు గోవిందరాజా
సుద్దులు చెప్నేనంటా చొక్కించితివి మేనులు
కొద్దిమీరె వలపులు గోవిందరాజా
(॥కొప్పు॥)
అలసితినంటాను ఆఁడువారిచే నేప్రొద్దు
కొలిపించుకొనే నిట్టే గోవిందరాజా
వలచితినంటాను వారితోడిమంతనాలు
కొలఁదిమీరె నెప్పుడు గోవిందరాజా
(॥కొప్పు॥)
పచ్చడము గప్పేనంటా పడఁతులతొడలపై
కొచ్చేవు నీమునివేళ్లు గోవిందరాజా
నిచ్చ నాలుగుచేతులు నిందుఁగాఁగిట నిద్దరి
గుచ్చేవు శ్రీవేంకటాద్రి గోవిందరాజా
(||pallavi||)
kŏppu vaṁga nī vĕṁtainā goviṁdarājā | paim̐ḍi-
kuppĕgaṭhāramu vaṭṭi goviṁdarājā
(||kŏppu||)
niddiriṁchenaṁnaḍānu nĕlam̐talasem̐bādālu
guddiṁchugŏne vippuḍu goviṁdarājā
suddulu sĕpnenaṁṭā sŏkkiṁchidivi menulu
kŏddimīrĕ valabulu goviṁdarājā
(||kŏppu||)
alasidinaṁṭānu ām̐ḍuvārise neprŏddu
kŏlibiṁchugŏne niṭṭe goviṁdarājā
valasidinaṁṭānu vāridoḍimaṁtanālu
kŏlam̐dimīrĕ nĕppuḍu goviṁdarājā
(||kŏppu||)
pachchaḍamu gappenaṁṭā paḍam̐tuladŏḍalabai
kŏchchevu nīmuniveḽlu goviṁdarājā
nichcha nālugusedulu niṁdum̐gām̐giḍa niddari
guchchevu śhrīveṁkaḍādri goviṁdarājā