Koosumdu mimtada nee korige konalusaage

కూచుండు మింతట నీ కోరికె కొనలుసాగె
Language

(॥పల్లవి॥)
కూచుండు మింతట నీ కోరికె కొనలుసాగె
తాచి యిపుడైన మాపై దయ వుట్టెనా

(॥కూచుం॥)
చెక్కు నొక్కి నిన్ను నింత సేదదేరుచక వుంటే
తెక్కుల నామోము చూచి తిట్టకుండేవా
ముక్కుననే వుండె నీకు ముంగోవ మప్పుడైతే
చక్కనిమన సింతటఁ జల్లనాయను

(॥కూచుం॥)
నగి సరసము లాడి నమ్మఁజాలక వుంటే
జిగి నిందరితో రట్టు సేయకుండేవా
జగడాలే నోట నుండె రిబేసి కపుడైతే
నిగిడి యింతట నీకు నెమ్మదాయనా

(॥కూచుం॥)
కందువ నీచేయి వట్టి కాఁగిట నేఁ గూడకుంటే
నిందలు మామీఁద నీవు నించకుండేవా
విందుల నా సొమ్మయితే శ్రీ వేంకటేశుఁడను నేను
సందడి మామచ్చికలు చవులాయనా

(||pallavi||)
kūsuṁḍu miṁtaḍa nī korigĕ kŏnalusāgĕ
tāsi yibuḍaina mābai daya vuṭṭĕnā

(||kūsuṁ||)
sĕkku nŏkki ninnu niṁta sedaderusaga vuṁṭe
tĕkkula nāmomu sūsi tiṭṭaguṁḍevā
mukkunane vuṁḍĕ nīgu muṁgova mappuḍaide
sakkanimana siṁtaḍam̐ jallanāyanu

(||kūsuṁ||)
nagi sarasamu lāḍi nammam̐jālaga vuṁṭe
jigi niṁdarido raṭṭu seyaguṁḍevā
jagaḍāle noḍa nuṁḍĕ ribesi kabuḍaide
nigiḍi yiṁtaḍa nīgu nĕmmadāyanā

(||kūsuṁ||)
kaṁduva nīseyi vaṭṭi kām̐giḍa nem̐ gūḍaguṁṭe
niṁdalu māmīm̐da nīvu niṁchaguṁḍevā
viṁdula nā sŏmmayide śhrī veṁkaḍeśhum̐ḍanu nenu
saṁdaḍi māmachchigalu savulāyanā