కూచుండఁబెట్టుకోరాదా కొమ్మను తొడమీఁదట
(॥పల్లవి॥)
కూచుండఁబెట్టుకోరాదా కొమ్మను తొడమీఁదట
యీచాయనేల లోఁగేవు యెవ్వరు వద్దనేరు
(॥కూచుం॥)
చెక్కులఁ జెమటగార చెలి నిన్నుఁ గొల్చి వచ్చె
జక్కువలఁ బోలేటిచన్ను లదర
అక్కర యెంతో నీకు నప్పటనుండీ నాపె-
దిక్కు చూచి సంతోసానఁ దెప్పలఁ దేలేవు
(॥కూచుం॥)
క్రుమ్ముడి జారఁగ నింతి కోరి కైదండ నీకిచ్చె
తమ్మిమోమున నిండాను దప్పులుదేరె
కమ్మి నీకరుణ యెంతో కరఁగి ఇందులకుఁగా
సమ్మతిగాఁ జనవిచ్చి సారె బుజ్జగించేవు
(॥కూచుం॥)
మతిచొక్క నలమేలుమంగ నీకుఁ బాదాలొత్తె
సతముగాఁ బులకలు జాజుకొనను
తతిఁ గూడితి వీకెను దాకొని శ్రీవేంకటేశ
ఇతవుగా మెచ్చి మెచ్చి ఇంపులుచల్లేవు
(||pallavi||)
kūsuṁḍam̐bĕṭṭugorādā kŏmmanu tŏḍamīm̐daḍa
yīsāyanela lom̐gevu yĕvvaru vaddaneru
(||kūsuṁ||)
sĕkkulam̐ jĕmaḍagāra sĕli ninnum̐ gŏlsi vachchĕ
jakkuvalam̐ boleḍisannu ladara
akkara yĕṁto nīgu nappaḍanuṁḍī nābĕ-
dikku sūsi saṁtosānam̐ dĕppalam̐ delevu
(||kūsuṁ||)
krummuḍi jāram̐ga niṁti kori kaidaṁḍa nīgichchĕ
tammimomuna niṁḍānu dappuluderĕ
kammi nīgaruṇa yĕṁto karam̐gi iṁdulagum̐gā
sammadigām̐ janavichchi sārĕ bujjagiṁchevu
(||kūsuṁ||)
madisŏkka nalamelumaṁga nīgum̐ bādālŏttĕ
sadamugām̐ bulagalu jājugŏnanu
tadim̐ gūḍidi vīgĕnu dāgŏni śhrīveṁkaḍeśha
idavugā mĕchchi mĕchchi iṁpulusallevu