Koosumdam bettugonave koba memtigi

కూచుండఁ బెట్టుకొనవే కోప మేఁటికి
Language

(॥పల్లవి॥)
కూచుండఁ బెట్టుకొనవే కోప మేఁటికి
కాచుకున్న రమణునిఁ గరుణించ వలదా

(॥కూచుండ॥)
నాటుకొన నిన్నుఁ జూచి నవ్వేటిపతితోడ
మాట లాడఁ గదవే మౌన మేఁటికి
ఆఁటదాని కింత యేలె అంతవాఁడు వేఁడుకోగ
కోటి నేరా లేమి గల్లాఁ గూడుకొన వలదా

(॥కూచండ॥)
కొంగు వట్టి నిన్నుఁ దీసి కొసరేటిపతి నిట్టే
సంగడిఁ గాఁగిలించ వేసట లేఁటికి
యింగితాన నొక్కవేళ యిద్దరిలోఁ గలఁగితే
సంగతిఁ జవి సేసుక చన వియ్య వలదా

(॥కూచుండ॥)
యిర వై తమ్ములము నీ కింద మనీ నాతఁ డదే
సిర సెత్త గదవే సిగ్గు లేఁటికి
నిరతి శ్రీవెంకటాద్రినిలయుఁడు నిన్నుఁ గూడె
తొరలిన నీరతులఁ దోడు చూప వలదా

(||pallavi||)
kūsuṁḍam̐ bĕṭṭugŏnave koba mem̐ṭigi
kāsugunna ramaṇunim̐ garuṇiṁcha valadā

(||kūsuṁḍa||)
nāḍugŏna ninnum̐ jūsi navveḍibadidoḍa
māḍa lāḍam̐ gadave mauna mem̐ṭigi
ām̐ṭadāni kiṁta yelĕ aṁtavām̐ḍu vem̐ḍugoga
koḍi nerā lemi gallām̐ gūḍugŏna valadā

(||kūsaṁḍa||)
kŏṁgu vaṭṭi ninnum̐ dīsi kŏsareḍibadi niṭṭe
saṁgaḍim̐ gām̐giliṁcha vesaḍa lem̐ṭigi
yiṁgidāna nŏkkaveḽa yiddarilom̐ galam̐gide
saṁgadim̐ javi sesuga sana viyya valadā

(||kūsuṁḍa||)
yira vai tammulamu nī kiṁda manī nādam̐ ḍade
sira sĕtta gadave siggu lem̐ṭigi
niradi śhrīvĕṁkaḍādrinilayum̐ḍu ninnum̐ gūḍĕ
tŏralina nīradulam̐ doḍu sūba valadā