Koorumuloom gosarevu gumpenaloom joobevu

కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు
Language

(॥పల్లవి॥)
కూరుములూఁ గొసరేవు గుంపెనలూఁ జూపేవు
ఆరితేరినదానవు ఆయా లంట రాదా

(॥కూరు॥)
చనవుగలదానవు సణఁగులు రాల్చనేలే
చెనకరాదా విభునిఁ జేతులారాను
వినయపు దానవు వెంగెము లాడనేలే
తనివారఁబదివేలు దండాలు వెట్టరాదా

(॥కూరు॥)
మచ్చికైనదానవు మనసు సోదించనేలే
పచ్చిదేరఁ గూడరాదా పలుమారును
యిచ్చ యెరిఁగినదాన వింపు లడుగనేలే
తచ్చి తచ్చి రతులలో తని వందించరాదా

(॥కూరు॥)
ఇతవరిదానవు ఇంత సిగ్గు వడనేలే
తతి విడె మియ్యరాదా తత్తరానను
చతురత శ్రీవేంకటేశ్వరుఁడిట్టె నన్నుఁగూడె
కతలుగా నీ వతనిఁగలయఁగరాదా

(||pallavi||)
kūrumulūm̐ gŏsarevu guṁpĕnalūm̐ jūbevu
āriderinadānavu āyā laṁṭa rādā

(||kūru||)
sanavugaladānavu saṇam̐gulu rālsanele
sĕnagarādā vibhunim̐ jedulārānu
vinayabu dānavu vĕṁgĕmu lāḍanele
tanivāram̐badivelu daṁḍālu vĕṭṭarādā

(||kūru||)
machchigainadānavu manasu sodiṁchanele
pachchideram̐ gūḍarādā palumārunu
yichcha yĕrim̐ginadāna viṁpu laḍuganele
tachchi tachchi radulalo tani vaṁdiṁcharādā

(||kūru||)
idavaridānavu iṁta siggu vaḍanele
tadi viḍĕ miyyarādā tattarānanu
sadurada śhrīveṁkaḍeśhvarum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
kadalugā nī vadanim̐galayam̐garādā