కూరిమి సిగ్గులు తెగీ కొంకనేఁటికి
(॥పల్లవి॥)
కూరిమి సిగ్గులు తెగీ కొంకనేఁటికి
యే రీతికైనా నీవు యియ్యకొనవయ్యా
(॥కూరి॥)
పట్టినదే వ్రతము పడఁతులకుఁ జలము
అట్టె పతులకుఁ జేయకపోరాదు
ఱట్టడి యాపె మోవిచూఱలకు నాసపడేవు
యెట్లైనఁ జేయనీ నీవియ్యకొనవయ్యా
(॥కూరి॥)
ఆడినదేమాటా అంగనలు పంతమున
నాడోడికయినా వినకపోరాదు
తోడనే మేలుది యాపె తొలఁగలేవు నీవు
యేడసుద్దికైనా నీవియ్యకొనవయ్యా
(॥కూరి॥)
తలఁచినదే పొద్దు తరుణుల కాఁగిటికి
వలపులు ముదిరెను వద్దనరాదు
బలువాపెది శ్రీ వెంకటపతివి నిన్నుఁ గూడె
యెలమి నన్నిటికి నీవియ్యకొనవయ్యా
(||pallavi||)
kūrimi siggulu tĕgī kŏṁkanem̐ṭigi
ye rīdigainā nīvu yiyyagŏnavayyā
(||kūri||)
paṭṭinade vradamu paḍam̐tulagum̐ jalamu
aṭṭĕ padulagum̐ jeyagaborādu
ṟaṭṭaḍi yābĕ movisūṟalagu nāsabaḍevu
yĕṭlainam̐ jeyanī nīviyyagŏnavayyā
(||kūri||)
āḍinademāḍā aṁganalu paṁtamuna
nāḍoḍigayinā vinagaborādu
toḍane meludi yābĕ tŏlam̐galevu nīvu
yeḍasuddigainā nīviyyagŏnavayyā
(||kūri||)
talam̐sinade pŏddu taruṇula kām̐giḍigi
valabulu mudirĕnu vaddanarādu
baluvābĕdi śhrī vĕṁkaḍabadivi ninnum̐ gūḍĕ
yĕlami nanniḍigi nīviyyagŏnavayyā