కూరిమి నీతోడి పొందే కోరుకున్నాఁడు
(॥పల్లవి॥)
కూరిమి నీతోడి పొందే కోరుకున్నాఁడు
తారుకాణగా నాతని తలఁపీడేరించవే
(॥కూరి॥)
జక్కవ చన్నులమీఁద సగినాలు చూచీఁ బతి
మొక్కుచుఁ బయ్యద నేల మూసి దాఁచేవే
ఇక్కువఁ బలుకు చిల్క లేలుపురొప్పలు వినీ
మక్కువఁ గోమలి నీవు మాఁటలాడవే
(॥కూరి॥)
కొప్పఁదేఁటి నల్లఁబులుగులతీరు చూచీని
వొప్పగఁ జెలిమాఁటున నొదుగ నేలే
కప్పకొని కనుపెంటిగరిమలే వెదకీని
యిప్పడు నీమోము వంచ నిఁక నేఁటికే
(॥కూరి॥)
మించు నడపు నెమళ్ల మెట్లు గతులు చూచీ
మంచి సు(శు?) భసూచనల మలయఁగదే
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె
పొంచీ యెలుఁగుగొవిల పోచిళ్లు దెలుపవే
(||pallavi||)
kūrimi nīdoḍi pŏṁde korugunnām̐ḍu
tārugāṇagā nādani talam̐pīḍeriṁchave
(||kūri||)
jakkava sannulamīm̐da saginālu sūsīm̐ badi
mŏkkusum̐ bayyada nela mūsi dām̐seve
ikkuvam̐ balugu silga leluburŏppalu vinī
makkuvam̐ gomali nīvu mām̐ṭalāḍave
(||kūri||)
kŏppam̐dem̐ṭi nallam̐buluguladīru sūsīni
vŏppagam̐ jĕlimām̐ṭuna nŏduga nele
kappagŏni kanubĕṁṭigarimale vĕdagīni
yippaḍu nīmomu vaṁcha nim̐ka nem̐ṭige
(||kūri||)
miṁchu naḍabu nĕmaḽla mĕṭlu gadulu sūsī
maṁchi su(śhu?) bhasūsanala malayam̐gade
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐gūḍĕ
pŏṁchī yĕlum̐gugŏvila posiḽlu dĕlubave