Koorimi gosaridene kobagimcheenaa

కూరిమి గొసరితేనే కోపగించీనా
Language

(॥పల్లవి॥)
కూరిమి గొసరితేనే కోపగించీనా
మేరమీర నెగ్గు లేవి మీలోనను

(॥కూరి॥)
పంతముగోనీనా పతివి నీయడాటాన
యింతికి నీమొగమోట మెఁ(మెం?)తైనాఁ గద్దు
యింతలో నేల లోఁగేవు యీమాట విని యాపె
చింతతో జేయెత్తి మొక్కి సిబ్బతిపడీని

(॥కూరి॥)
తగవుకుఁ దీసీనా తరుణి నీసుద్దులకు
మిగులఁ బ్రియములు నీమీఁదనే కద్దు
మగువ నేలఁ పేవు మనసు గరఁగి యాపె
తగినకానిక లంపి తమక మందీని

(॥కూరి॥)
వాసివంతు లెంచీనా వలపులో కతలకు
సేసలు నీమీఁదఁ బెట్టి చెలిమి సేసీ
అసల శ్రీవేంకటేశ అంతలో గూడితి వీపె
తాసువలెఁ దులఁదూగి తనివిఁ బొందీని

(||pallavi||)
kūrimi gŏsaridene kobagiṁchīnā
meramīra nĕggu levi mīlonanu

(||kūri||)
paṁtamugonīnā padivi nīyaḍāḍāna
yiṁtigi nīmŏgamoḍa mĕm̐(mĕṁ?)tainām̐ gaddu
yiṁtalo nela lom̐gevu yīmāḍa vini yābĕ
siṁtado jeyĕtti mŏkki sibbadibaḍīni

(||kūri||)
tagavugum̐ dīsīnā taruṇi nīsuddulagu
migulam̐ briyamulu nīmīm̐dane kaddu
maguva nelam̐ pevu manasu garam̐gi yābĕ
taginagāniga laṁpi tamaga maṁdīni

(||kūri||)
vāsivaṁtu lĕṁchīnā valabulo kadalagu
sesalu nīmīm̐dam̐ bĕṭṭi sĕlimi sesī
asala śhrīveṁkaḍeśha aṁtalo gūḍidi vībĕ
tāsuvalĕm̐ dulam̐dūgi tanivim̐ bŏṁdīni