కూరిమి గలితేఁ జాలు కోపించిన మేలువో
(॥పల్లవి॥)
కూరిమి గలితేఁ జాలు కోపించిన మేలువో
ఆరయ నో రమణుఁడ అంతాను మేలువో
(॥కూరి॥)
మనసున నీవు నన్ను మఱవకున్నాఁ జాలు
యెనసి నీ వేడనున్నా నియ్యకోలే పో
ననుపువలపు నీవు నాపైఁ జల్లితేఁ జాలు
వెనక నీవు వేమన్నా వేడుకలో పో
(॥కూరి॥)
పాయము నీ మేనిమీఁద పచ్చిగా నుండతేఁ జాలు
రాయడి విరహమైన రాజ్యపదవి
యేయెడ నీచూ పొకమా టిటు పైఁబారితేఁజాలు
నాయములు దప్పి నీవు నడచినా మేలువో
(॥కూరి॥)
పానుపుపై కూడి నాకు పంతమిచ్చితేఁ జాలు
కానని కన్నుల నీబింకాలు మేలేపో
ఆనిన శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి
కోనల నీ కొనగోరిగుఱుతులు మేలువో
(||pallavi||)
kūrimi galidem̐ jālu kobiṁchina meluvo
āraya no ramaṇum̐ḍa aṁtānu meluvo
(||kūri||)
manasuna nīvu nannu maṟavagunnām̐ jālu
yĕnasi nī veḍanunnā niyyagole po
nanubuvalabu nīvu nābaim̐ jallidem̐ jālu
vĕnaga nīvu vemannā veḍugalo po
(||kūri||)
pāyamu nī menimīm̐da pachchigā nuṁḍadem̐ jālu
rāyaḍi virahamaina rājyabadavi
yeyĕḍa nīsū pŏgamā ṭiḍu paim̐bāridem̐jālu
nāyamulu dappi nīvu naḍasinā meluvo
(||kūri||)
pānububai kūḍi nāgu paṁtamichchidem̐ jālu
kānani kannula nībiṁkālu melebo
ānina śhrī veṁkaḍeśha aṁtalo nannelidivi
konala nī kŏnagoriguṟudulu meluvo